కమలాంబాం భజరే - Kamalambam Bhajare - Kalyani - Aadi (2 kalai - Double beat) - 2nd Navaav...
ప: కమలాంబాం భజరే రే మానస
కల్పిత మాయా కార్యం త్యజ రే

అ. ప: కమలా వాణీ సేవిత పార్శ్వాం
కంబు జయ గ్రీవాం నత దేవాం
కమలా పుర సదనాం మృదు గదనాం
కమనీయ రదనాం కమల వదనామ్

౧. సర్వ-ఆశా-పరిపూరక-చక్ర స్వామినీం
పరమ-శివ కామినీం
దుర్వాస-అర్చిత గుప్త-యోగినీం
దుఃఖ ధ్వంసినీం హంసినీమ్
నిర్వాణ నిజ సుఖ ప్రదాయినీం
నిత్య కల్యాణీం కాత్యాయనీం
శర్వాణీం మధుప విజయ వేణీం
సద్-గురు గుహ జననీం నిరంజనీమ్
గర్విత భండ-అసుర భంజనీం
కామాకర్షిణి-ఆది రంజనీం
నిర్విశేష చైతన్య రూపిణీం
ఉర్వీ తత్వ-ఆది స్వరూపిణీం

 ౨. ముత్తుస్వామి దీక్షితుల వారి నవావరణ కీర్తనలలోని ద్వితీయావరణ కీర్తన "కమలాంబాం భజరే మానస"అన్నది. కళ్యాణీ రాగము, ఆదితాళంలో కూర్చబడినది.

"ఓ మనసా! ఈ లౌకిక మాయాకార్యములను త్యజించి శ్రీదేవిని భజింపుము. లక్ష్మీవాణీ సేవిత అయిన దానిని, కంబుజయగ్రీవ అయిన దానిని, దేవతల చేత నమస్కరింప బడినదానిని, మృదువైన వాక్కులు కలదానిని, కమలనేత్రను, సర్వాశాపరిపూరక చక్రస్వామినిని, శివకామినిని, దూర్వాసార్చిత గుప్త యోగినిని, దుఃఖధ్వంసినిని, నిర్వికార స్వరూపిణిని, భండాసురభంజనిని, కామాకర్షిణ్యాది దేవతా రంజనిని, చైతన్యస్వరూపిణిని, ఉర్వితత్త్వాది స్వరూపిణిని, - ఓ మనసా౧ భజింపుము - అని ఈ కీర్తన అర్థము.
ఈ కీర్తనలో శ్రీచక్రములోని రెండవ ఆవరణమైన షోడశదళ పద్మము - అందులోని ఆవరణ దేవతలు, అచటి యోగిని, చక్రస్వామినులు వర్ణింపబడినారు. ఈ ఆవరణమునకు సర్వాశాపరిపూరక చక్రమని పేరు.
ఈ ఆవరణములోని 16పద్మ దళములను 16 మంది ఆవరణ దేవతలు అధివసించి ఉన్నారు. వారు - కామాకర్షిణి - బుద్ధ్యాకర్షిణి - అహంకారాకర్షిణి - శబ్డాకర్షిణి - స్పర్శాకర్షిణి - రూపాకర్షిణి - రసాకర్షిణి - గంధాకర్షిణి - చిత్తాకర్షిణి - ధైర్యాకర్షిణి - స్మృత్యాకర్షిణి - నామాకర్షిణి - బీజాకర్షిణి - ఆత్మాకర్షిణి - అమృతాకర్షిణి - శరీరాకర్షిణి - అనేవారు. అందుకే ఈ కీర్తనలో 'కామాకర్షిణ్యాదిరంజనీం' అని సంబోధించారు దీక్షితుల వారు.
దీనికి సర్వాశాపరిపూరక చక్రమని పేరు కనుక 'సర్వాశాపరిపూరక చక్రస్వామినీం' అని సంబోధించారు.
ఈ చక్రస్వామిని త్రిపురేశి - ఆమెయే పరమ శివకామిని. ఇచ్చటి యోగిని గుప్తయోగిని. ఆ విషయాన్నే దీక్షితుల వారు 'దూర్వాసార్చిత గుప్తయోగినీం, దుఃఖధ్వంసినీం, హంసినీం' అని వర్ణించారు. దూర్వాసుడు 12మంది శ్రీవిద్యాచక్రవర్తులలో ఒకడు. ఆయన మంత్రద్రష్ట కూడా. 
ఈ కీర్తనలోని అనుపల్లవిలో 'కమలా వాణీ సేవిత పార్శ్వాం’ అన్నది లలితా సహస్ర నామావళిలోని సచామరరమావాణీ సవ్యదక్షిణ సేవితా’ అన్న నామ తాత్పర్యమే.
చరణములలోని -నిర్వాణ సుఖదాయినీ, నిత్యా, కళ్యాణీ, కాత్యాయినీ, శర్వాణీ - అన్నవి సహస్రనామావళిలోని సంబోధనలే.
ఈ ఆవరణములోని అమ్మవారి సంబోధనలన్నీ ద్వితీయావిభక్తిలో ఉన్నాయి.  ఉన్నాయి.  "గర్విత భండాసుర భంజనీం" అని కీర్తన చరణములలో శ్రీదేవి వర్ణింపబడింది. ఈ భండాసురుని వృత్తాంతము లలితోపాఖ్యానములో సవిస్తరముగా ఉన్నది.
(బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు)


Comments

 1. ఆత్మజ్ఞాన స్వరూపునకు నమస్కారం,

  మహానుభావులైన మీరు ఎంతో కాలంగా శ్రమ కోర్చి జ్ఞాన యజ్ఞంలో బాగంగా ధర్మ సంబంద విషయాలను తెలియ చేస్తున్నారు, అందులకు కృతజ్ఞతలు తెలియచేసుకొంటున్నాము. అలాగే ఉడతా భక్తి గా సాయినాధుని కృపవల్ల భక్తి, జ్ఞాన సంబంద బ్లాగ్స్ ల నుంచి తాజా సమాచారాన్ని సేకరించి ఒకేచోట అందించే Aggregator బ్లాగ్ ను మహానుభావులైన పెద్దల సలహా మేరకు రూపొందించటం జరిగింది. ఇటువంటి అవకాశం కల్పించి, సేవ చేసుకొనే అవకాశం కల్పించిన వారికి మేము ఎంతో ఋణపడిఉంటాము. దయచేసి ఈ వెబ్ సైట్ దర్శింపగలరని మేము మనవి చేసుకొంటున్నాము.

  సాయి రామ్ సేవక బృందం,
  తెలుగు భక్తి సమాచారం - http://telugubhakthisamacharam.blogspot.in
  సాయి రామ్ వెబ్ సైట్ - http://www.sairealattitudemanagement.org
  * సర్వం శ్రీ సాయినాథ పాద సమర్పణమస్తు*

  ReplyDelete

Post a Comment

Popular posts from this blog

గరుడగమన తవ చరణకమలమిహ మనసి లసతు మమ నిత్యం౹

గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి