Posts

Showing posts from May, 2019

వినయమునను కౌశికుని వెంట

ప. వినయమునను కౌశికుని వెంట చనినాంఘ్రులను జూచునదెన్నటికో అందు వెనుక రాతిని నాతి జేసిన చరణములను జూచునదెన్నటికో (వి) చ 1. ఘనమైన శివుని చాపము ద్రుంచిన పాదమును జూచునదెన్నటికో ఆ జనక రాజు పాల కడిగినయా కాళ్ళను జూచునదెన్నటికో (వి) చ 2. చనువున సీతను బొట్టు కట్టిన కరమును జూచునదెన్నటికో కోపమున భృగు సుతు చాప బలమందుకొన్న బాహువు జూచునదెన్నటికో (వి) చ 3. వనమున చని విరాధుని చంపిన చేతులను జూచునదెన్నటికో అల్ల ముని జనులను కని అభయమిచ్చిన హస్తమును జూచునదెన్నటికో (వి) చ 4. తనకు తానే కాకాసురుని కాచిన శరమును జూచునదెన్నటికో క్షణమున బహు రథముల పొడి చేసిన- యస్త్రమును జూచునదెన్నటికో (వి) చ 5. ఘన బలుడైన వాలిని చంపిన బాణమును జూచునదెన్నటికో ఆ వనధి మద గర్వమణచిన సాయకమును జూచునదెన్నటికో (వి) చ 6. కని కరమున విభీషణుని జూచిన కన్నులను జూచునదెన్నటికో రావణుని కొట్టి పేద కపులు లేవ జూచు దృష్టిని జూచునదెన్నటికో (వి) చ 7. వన చరాధిపుని చల్లగ జూచిన నేత్రమును జూచునదెన్నటికో దినమును లంక వర్ధిల్లను జూచు లోచనమును జూచునదెన్నటికో (వి) చ 8. ఘనమైన పుష్పకమున రాజిల్లిన సొగసు

రామా నీయెడ ప్రేమ రహితులకు

Image
ప. రామా నీయెడ ప్రేమ రహితులకు నామ రుచి తెలుసునా ఓ సీతా (రా)   అ. కామినీ వేషధారికి సాధ్వీ నడత- లేమైన తెలుసునా ఆ రీతి సీతా (రా) చ. తన సౌఖ్యము తానెరుగకనొరులకు తగు బోధన సుఖమా ఘనమగు పులి గో రూపమైతే త్యాగ- రాజ నుత శిశువుకు పాలు కల్గునా (రా)

రమించు వారెవరురా రఘోత్తమా నినువినా

Image
పల్లవి రమించు వారెవరురా రఘోత్తమా నినువినా అనుపల్లవి శమాది షడ్గుణగణ సకల భువన జనులలో (రమించు) ౧. రమయనే సుమర్మము రామయనే శర్మము తదమరవరుల కబ్బెనో త్యాగరాజ సన్నుతా (రమించు)

తెలిసి రామ చింతనతో నామము సేయవే ఓ మనసా

ప. తెలిసి రామ చింతనతో నామము సేయవే ఓ మనసా అ. తలపులన్ని నిలిపి నిమిషమైన తారక రూపుని నిజ తత్వములను (తె) చ 1. రామాయన చపలాక్షుల పేరు కామాదుల పోరు వారు వీరు రామాయన బ్రహ్మమునకు పేరు ఆ మానవ జననార్తులు తీరు (తె) చ 2. అర్కమనుచు జిల్లెడు తరు పేరు మర్కట బుద్ధులెట్టు తీరు అర్కుడనుచు భాస్కరునికి పేరు కు-తర్కమనే అంధకారము తీరు (తె) చ 3. అజమనుచు మేషమునకు పేరు నిజ కోరికలేలాగీడేరు అజుడని వాగీశ్వరునికి పేరు విజయము కల్గును త్యాగరాజ నుతుని (తె) https://www.jiosaavn.com/song/peridi-ninnu-penchina-varevare-dr.m.balamuralikrishna/NxwHfyZUZ1o