Posts

ఎన్నడు జూతునో ఇన కుల తిలక

Image
ప. ఎన్నడు జూతునో ఇన కుల తిలక ని(న్నె) అ. పన్నగ శయన భక్త జనావన పున్నమ చందురు పోలు ముఖమును (ఎ) చ. ధరణిజా సౌమిత్రి భరత రిపుఘ్న వానర యూథ పతి వరుడాంజనేయుడు కరుణను ఒకరికొకరు వర్ణింప- నాదరణను పిలిచే నిన్ను త్యాగరాజార్చిత (ఎ)

దినమే సుదినము సీతారామ స్మరణే పావనము

Image
ప: దినమే సుదినము సీతారామ స్మరణే పావనము || దినమే ||
చ 1: ప్రీతినై నా ప్రాణభీతి నైనా కలిమి చేతనైనా మిమ్మే ఏతీరుగ తలచిన ఆ || దినమే ||
చ 2: అర్థాపేక్షను దినము వ్యర్ధముగాకుండ సార్ధకముగా మిమ్ము ప్రార్ధన చేసిన ఆ || దినమే ||
చ 3: నిరతము మెరుగు బంగారు పుష్పముల రఘు వరుని పదముల నమర పూజించిన ఆ || దినమే ||
చ 4: మృదంగ తాళము తంబురశృతి గూర్చి మృదు రాగము కీర్తన పాడినను విన్న ఆ || దినమే ||
చ 5: ఘనమైన భక్తిచే పెనగొని యే వేళ మనమున శ్రీరాముని చింతించిన ఆ || దినమే ||
చ 6: భక్తులతో ననురక్తిని గూడక భక్తి మీరగను భక్తవత్సలు పొగడగా || దినమే ||
చ 7: దీనశరణ్య మహానుభావ యోగానలోల నను కరుణింపుమని కొలుచు ఆ || దినమే ||
చ 8: వాసిగ శ్రీహరిదాసుల గూడుకొని వాసుదేవు వాంఛతోను పాడెడి ఆ || దినమే ||
చ 9: అక్కరతోడ భద్రాచలమునను చక్కని సీతారాములను చూచిన ఆ || దినమే ||

పరమ పాతకుడ భవ బంధుడ శ్రీ హరినిను దలచనే నరుహుడనా

Image
పరమ పాతకుడ భవ బంధుడ శ్రీ హరినిను దలచనే నరుహుడనా || ||పరమ పాతకుడ||
అపవిత్రుడనే నమంగళుడ కడు నపగత పున్యుడ నలసుడను కపట కలుష పరికర హృదయుడనే నపవర్గమునకు అరుహుడనా || ||పరమ పాతకుడ|| అతిదుష్డుడ నే నధిక దూషితుడ హత వివేక మతి నదయుడను ప్రతిలేని రమాపతి నినుదలచే నతులగతికి నే నరుమడనా || ||పరమ పాతకుడ|| అనుపమ విషయ పరాధీనుడనే ననంత మోహ భయాతురుడ విను తింపగ తిరు వేంకటేశఘను లనఘులుగాక నే నరుహుడనా || ||పరమ పాతకుడ||

పురుషోత్తముడ నీవు పురుషాధముడ నేను

Image
పురుషోత్తముడ నీవు పురుషాధముడ నేను ధరలో నాయందు మంచితన మేది అనంతాపరాధములు అటు నేము సేసేవి అనంతమయినదయ అది నీది నిను నెఱగకుండేటినీచగుణము నాది నను నెడయకుండేగుణము నీది సకలయాచకమే సరుస నాకు బని సకలరక్షకత్వము సరి నీపని ప్రకటించి నిన్ను దూరేపలుకే నా కెప్పుడూను వెకలివై ననుగాచేవిధము నీది నేర మింతయును నాది నేరు పింతయును నీది సారెకు నజ్ఞాని నేను జ్ఞానిని నీవు యీరీతి శ్రీ వేంకటేశ యిట్టే నన్ను నేలితివి ధారుణిలో నిండెను ప్రతాపము నీది

దీనుడను నేను దేవుడవు నీవు

Image
ప|| దీనుడను నేను దేవుడవు నీవు | నీ నిజరూపమే నెరపుటగాక || చ|| మతి జననమెరుగ మరణంబెరుగను | యితవుగ నినునింక నెరిగేనా క్షితి బుట్టించిన శ్రీపతివి నీవు | గతి నాపై దయ దలతువు గాక || చ|| తలచపాపమని తలచపుణ్యమని | తలపున యిక నిన్ను దలచలేనా || అలరిననాలో అంతర్యామివి | కలుషమెడయ నను గాతువుగాక || చ|| తడవనాహేయము తడవనా మలినము | తడయక నీమేలు తడవేనా
విడువలేని శ్రీవేంకట విభుడవు | కడదాక నికగాతువు గాక ||

తెలియ చీకటికి దీపమెత్తక, పెద్ద వెలుగు లోపలికి వెలుగేలా

Image
ప|| తెలియ చీకటికి దీపమెత్తక, పెద్ద | వెలుగు లోపలికి వెలుగేలా ||
చ|| అరయ నాపన్నుని కభయ మీవలెగాక | ఇరవైన సుఖి గావనేలా | వరుత బోయెడువానివడి దీయవలె గాక | దరివాని తివియ(గ దానేలా || చ|| ఘనకర్మారంభుని కట్లు విడవలె గాక | యెనసి ముక్తుని గావనేలా | అనయము దుర్బలుని కన్న మిడవలెగాక | తనిసిన వానికి దానేలా || చ|| మితిలేని పాపకర్మికి దావలె గాక | హిత మెరుగు పుణ్యునికి నేలా | ధృతిహీను గృపజూచి తిరువేంకటేశ్వరుడు | తతి గావకుండిన తానేలా ||

ఏ కులజుడైననేమి యెవ్వడైననేమి

Image
ఏ కులజుడేమి యెవ్వడైననేమి
ఆకడ నాతడె హరినెఱిగినవాడు

పరగిన సత్యసంపన్నుడైన వాడే
పరనిందసేయ తత్పరుడు గాని వాడు
అరుదైన భూతదయానిధి యగువాడే
పరులదానే యని భావించువాడు

నిర్మలుడై యాత్మనియతి గలుగువాడే
ధర్మతత్పరబుధ్ధి తగిలిన వాడు
కర్మమార్గములు తడవనివాడే
మర్మమై హరిభక్తి మఱవనివాడు

జగతి పై హితముగా చరియించువాడే
పగలేక మతిలోన బ్రతికినవాడు
తెగి సకలము ఆత్మ తెలిసినవాడే
తగిలి వెంకటేశు దాసుడయినవాడు