Posts

Showing posts from October, 2012

బ్రోచెవారెవరురా

Image
బ్రోచేవారెవరురా
త్యాగరాజ కృతి
ఖమాస్ రాగం

బ్రోచే వారెవరురా నిను వినా రఘు వరా
నీ చరణామ్బుజ మును నేవిడజాల కరుణాల వాల ||

ఓ చతురాననాది వందిత నీకు పరాకేల నయ్య
నీ చరితము పొగడ లేను నా చింత తీర్చి వరములిచ్చి వేగమె||

సీతాపతే నా పై నీ కభిమానము లేదా
వాతాత్మజా ర్చిత పాద నా మొరలను విన రాదా

ఆతురముగ కరి రాజుని బ్రోచిన వాసు దేవుడె నీవు కదా
నా పాతక మెల్ల పోగొట్టి గట్టిగ నా చేయి బట్టి విడువక |

నను పాలింపగ

Image
ప. నను పాలింప నడచి వచ్చితివో
నా ప్రాణ నాథ

అ. వనజ నయన మోమును జూచుట
జీవనమని నెనరున మనసు మర్మము తెలిసి (నను)

చ. సుర పతి నీల మణి నిభ తనువుతో
ఉరమున ముత్యపు సరుల చయముతో
కరమున శర కోదండ కాంతితో
ధరణి తనయతో త్యాగరాజార్చిత (నను)

ఎందఱో మహానుభావులు