Posts

Showing posts from August, 2018

బాలురతోనాడి చాలా అలిసీనావు

బాలురతోనాడి చాలా అలిసీనావు పాలుత్రాగ రార గోపాలా
పాలు త్రాగామని లీలతో ననుబిలిచి -- రోలగట్టెదవమ్మ రాజాల పుండరీకాక్ష ... నీవెండలో దిరిగిన గుండెలెండె రార ... గోపాలా గుండెలెండెనని ఖండించి ననుబిలచి ... దండింతువే తల్లి రాజాల వెన్నుఁడ ! నీ చిన్ని బొజ్జకింత వెన్నబెట్టెద రారా గోపాలా వెన్నబెట్టెదనని సన్నుతింపుచు బిలచి -- సున్నా చుట్టెదవమ్మ రాజాల ఎరా ! యదువంశ ధీరా !! శ్రీమన్నారాయణా రార !! గోపాల కృష్ణ ! నారాయణా రార గోపాలా !! నారాయణా !! యని నాడే పిలచిన... నాడే వచ్చేదనింత సేపేలా ? తల్లి ! నాడెవచ్చేదనింత సేపేలా ? తల్లి !! నాడే వచ్చేదనింత సేపేలా !!

రాధారమణా మాధవశౌరీ శ్రీధర గోవిందా

రాధారమణా మాధవశౌరీ శ్రీధర గోవిందా – మురారీ శ్రీధర గోవిందా!!
ఆధారంబవీ అఖిలాండంబుల కరయగ నొరులేరీ మురారీ అరరీ !!రాధా!! ౧. దయరాదేలా దశరథ బాలా దానవ సంహారా మురారీ దానవ సంహారా భయమును దీర్పవే భక్త సుపాలా పావనతర లీలా మురారీ !!రాధా!!
౨. మారజనక నీ మరుగు జేరితిని కోరిక దీర్పుమయా మురారీ కోరిక దీర్పుమయా భారమయ్యె సం-సారము నిను జేరు దారిజూపుమయ్య మురారీ !!రాధా!!
౩. నేరము లెంచకు నేనీ దాసుడ మారమణీ రామనా మురారీ మా రమణీ రమణా కారణ కారణ కంసవిమర్దన నీరజ దళ నాయనా మురారీ నీరజ దళ నయనా !!రాధా!!
౪. శ్రీధర కృష్ణా తీరవిరాజిత చిత్రకూట నిలయా మురారీ చిత్రకూట నిలయా మాధవ విధి రుద్రమయ శ్రీ నరసింహ మానస సంచారా మురారీ మానస సంచారా !!రాధా!!

స్మర మనసా శ్రీరామం

స్మర మనసా శ్రీరామం !!స్మర!!
హరిహరవిధి దేవీ – గణపతి రూపం !!స్మర!!
౧. గోలోక హర్మ్యాంతర శ్రీనివాసం గోపాలం గోప గోగోపికాయుతం భూలోక కోసలాయోధ్యా విహారిణం భూమిజా సోదర బుధజన సహితం !!స్మర!!
౨. నిగామాగమాంతం నిత్య నిరంజనం భగవంత మ-పార కృపానిధిం జగదుదయాలయ సంస్థితి మూలం అగణిత మణిగణ హారవిభూషం !!స్మర!!
౩. చిత్రవిచిత్ర ప-విత్ర చరిత్రం శ్రీ నారాయణం చిన్మయమాద్యం చిత్రకూట దుర్గాక్షేత్ర నివాసినం శ్రీనరసింహాభీష్టదాయినం !!స్మర!!

సర్వేశ నీకిదే మంగళం

సర్వేశ నీకిదే మంగళం
సాధుపోషకా ఓ సాక్షీ రూపకా సర్వేశ నీకిదే మంగళం!!
నిర్వికార ఓ నిగమా గోచరా రామ సర్వాకాలము నీ స్మరణా చేసెదను!!సర్వేశ!!
భావాతీత ఓ ప్రణవారూపకా రామ – దేవదేవ నన్ను బ్రోవ భారమా సావధానమూ తోనూ బ్రోవుమా భావమందుననిన్ భజియించెదను!!సర్వేశ!!
శరణు శరణనిన్ చేరి మ్రొక్కెదను – జనన మరణ బాధ మాన్పరాదయో చరణ ధ్యానమునే మరువజాలను – పరమ పావనా బాలాంబ సద్గురు దేవ!!సర్వేశ!!

రఘుకుల భవతే మంగళం

రఘుకుల భవతే మంగళం – జయ రావణ హరతే మంగళం
నాగపున్నాగ కదంబ సుకల్పక మాతులుంగ లవంగలతాశ్రీతలతాశోక శ్రీవన సంచారభూతల పాలతే మంగళం జయ!! భక్తాభయకర పాపవిమోచన పావననామ శుభంకరా యుక్తాయుక్త వివేక మౌని జన ముక్తి రూపాయతే మంగళం జయ!! సారబీజాపుర నారసింహనుత హారకటకమనిభూషణా మారజనక శ్రీజానకీ సతియుత మంగళ వేషతే మంగళం జయ!!

వరవిధి సురమునులు ధరణీతో క్షీరాబ్ధి కరగి రావణుబాధాలెరుగాజెప్పి

వరవిధి సురమునులు ధరణీతో క్షీరాబ్ధి కరగి రావణుబాధాలెరుగాజెప్పి
పరిపారివిధమూలా ప్రస్తుతింపగ వారీ కరుణింపా బుట్టీనా కౌసల్యా రామా మంగళం మంగళం!!
బాలా లీలలు జూపి పాపీ తాటక ద్రుంచీ లీలా సుబాహూని కూలనేసీ గాలీకోలచమాయే శాలీమారీచూని లీలాకడలి వైవ జాలిన రామా మంగళం మంగళం!! 
మౌనీ యాగముగాచి మౌని భార్యను బ్రోచి మౌనీ యానతి గూర్చి మన్నించి మించి జనకుని పురిజేరి జగదీశు విలువిరచి జానకిని పెండ్లాడి జయమొందిన రామా!!
రావణాది దుష్టరాక్షసుల మర్దించి పావని మొదలైన భక్తుల గాంచి దేవర్షుల ముదమున దేల్చి ధరనోదార్చి దేవీతో కోసల దేశమేలిన రామా మంగళం మంగళం!!
హరి శివ విధిమంతా నీవై ముక్తి కరుగు వారికి మైన మూల తారకమై ధర బీజాపుర భక్త నరసింహ వరదుడవై సిరితోడ నెలకొన్న చిన్మయుడా రామా మంగళం మంగళం!!

మంగళంబే శంభురాణీ మానిని ఓ పువ్వు బోణీ

మంగళంబే శంభురాణీ మానిని ఓ పువ్వు బోణీ
భ్రుంగు కుంతల వేణివమ్మా – పుత్తడీ బంగారు బొమ్మా నిన్నె గొల్చుచుంటినమ్మా – నీదు కరుణ జూపవమ్మా!!మంగళంబే!!
మల్లెపూలు తెచ్చి నిన్ మగువరొ పూజిస్తునమ్మా యుల్లమందు మరువకమ్మా ఉవిదరొ దయజూడవమ్మా!!మంగళంబే!!
దోషములను ఎంచకమ్మా దోసిలొగ్గి ఉంటినమ్మా కాశివిశ్వేశ్వరుని కొమ్మా – కనికరించ సమయమమ్మా!!మంగళంబే!!
అంగనలొసగేటి శుభమంగళములనందవమ్మా రంగదాసు నేలినట్టి రాణీ వరమీయవమ్మా!!మంగళంబే!!

హారతీమీరెలా ఈయారే అంబకూ

హారతీమీరెలా ఈయారే అంబకూ మంగళ హారతీ మీరేల ఈయారే!! హారతీ మీరేల ఈయరే జ్ఞానవిద్యలకెల్ల ప్రబలము లీలతో పదహారు వన్నెల మేలిమీ బంగారు తల్లికి!!హారతీ!!
పాదములకూ పూజ సాయారే మాతల్లికిపుడు పారిజాతపు హారమివ్వారే!!హారతీ!!
ఆణిముత్యపు హారాలు మొల నూలు గజ్జెలు జోడు అందెల రవల పాపట బొట్టు ముక్కర సమయముగ ధరియించు తల్లికి!!హారతీ!!
ఇంత పారాకేలనానారే రుద్రునీ దేవికి చెంతనుండి పూజ సాయారే శంకరీ ఓంకార రూపిణి కుంకుమస్థగితాలంకారి పొంకమైనయలంకారికి!!హారతీ!!
లక్షవత్తుల జ్యోతి గూర్చారే – చెలులార మీరూ పచ్చని పళ్ళెముల వాల్చారే – రక్షితంబుగాను !!హారతీ!!

హారతిదె జగదీశ్వరీ జయ హారతిదె పరమేశ్వరీ

హారతిదె జగదీశ్వరీ జయ హారతిదె పరమేశ్వరీ
శ్రీరమేశ సురేశ సన్నుత శ్రీకరీ శివ శాంకరీ!!

౧. మేరుశైల విహారిణీ నిన్ కోరి కొలిచెద దీమణీ
హారకటక కిరీటకుండల హారనూపుర ధారిణీ!! హారతిదె!!

౨. మూలకారణశక్తి త్రిజగన్మోహినీ చిద్రూపిణీ
నీల సుందర వేణి పద్మా రాగిణీ కృపామణీ!! హారతిదె!!

౩. శరణుపాపవిమోచనీ శ్రీచక్రరాజ నివాసినీ
శరణు శరణు కృపాంతరంగిణి శంకరార్థ శరీరిణీ!! హారతిదె!!

౪. అంబుజానన మ్రొక్కెదను నాకభయమిమ్ము దయామయీ
అంబమాణిక్యాంబ సీతామాంబ హృత్కమలాలయా!! హారతిదె!!

శ్రీరామచంద్రునకు మంగళం

శ్రీరామా శ్రిత చింతామణి శుభ నీరాజన జయ హారతిదే

హిందుస్థానీ కాఫీ రాగం – ఆదితాళం

ప:శ్రీరామా శ్రిత చింతామణి శుభ నీరాజన జయ హారతిదే!!శ్రీరామా!!
అ ప:తారాగణ సమ రారాజాన్వయ తారానాధా దాశరధే!!శ్రీరామా!!

చ౧:అగణిత మణిగణ సుగుణ విభూషిత – నగరాజాత్మజ నాధనుతా
భోగయుతా త్యాగిహితా ఆగమసన్నుత ఆయమహితా!!శ్రీరామా!!

చ౨:వానర సన్నుత వరముని సేవిత భానువంశ భవ భయ రహితా
గానరతా దీనహితా మానవభావిత మాసహితా!!శ్రీరామా!!

చ౩.శూరాదనుజ సం-హారా నగసమ-దీరా భక్త మందార హరా
బీజపురా గారచారా నరసింహార్చిత నవమారా!!శ్రీరామా!!