Posts

Showing posts from October, 2020

దేవీం ప్రణమామ్యహమ్ (ఋషిపీఠం విశిష్టసంచిక) 2004

Image
హిందూ సంప్రదాయములో శ్రీదేవీ నవరాత్రులకు విశిష్ట ప్రాధాన్యం ఉన్నది . మన భారతదేశంలో ఈ దేవీ పూజలు వేదకాలం నుంచే ఉన్నాయనడానికి ఋగ్వేదంలోని దేవీసూక్త , రాత్రిసూక్తాదులే నిదర్శనం . బ్రాహ్మణములు , అరణ్యకములు , ఉపనిషత్తులలో కూడా దేవీ ప్రస్తావన విరివిగా ఉన్నది . మహాభారతంలో దుర్గాదేవి స్తుతి ఉన్నది . స్కాంద , మత్స్య , వామన , వరాహాది పురాణాలలో దేవీవృత్తాంతం కనిపిస్తున్నది . దేవీ భాగవతం శ్రీదేవీ ప్రాశస్త్యాన్ని వేనోళ్ళ కొనియాడుతున్నది . దేవీ నవరాత్రులు రెండు రకాలుగా జరుగుతాయి . చైతశుద్ధ విదియ మొదలు నవమి వరకూ చేసే నవరాత్రులను వసంత నవరాత్రులని , ఆశ్వయుజ శుద్ధ విదియ మొదలు నవమి వరకూ చేసే నవరాత్రులను శరన్నవరాత్రులని పిలుస్తారు . ఈ రెండింటిలోను శరన్నవరాత్రులకే దేవీనవరాత్రులని ప్రసిద్ధి . ఈ శరన్నవరాత్రులలో దేవీపూజలను తొమ్మిది రోజులు చెయ్యడానికి కారణం భవిష్యపురాణం , దేవీపురాణము , మార్కండేయ పురాణములలో చెప్పబడింది . దుష్టశిక్షణ , శిష్టరక్షణ చేయడానికి ఆదిశక్తి అయిన జగన్మాత తొమ్మిది అవతారాలను ధరించింది . అవి మహాకాళి , మహిషాసురమర్దిని , చాముండ , నంద , రక్తదంతి , శాకంభరి , దుర్గ , మాతంగిని , భ్రామరి అన