Posts

Showing posts from May, 2020

నే పొగడకుంటే నీకేమి కొదవో

Image
ప. నే పొగడకుంటే నీకేమి కొదవో నీ మనసు తెలిసె కదరా ఓ రామ అ. ప్రాపు కల శుక సనక ప్రహ్లాద నారద పరమేశ రుద్రాది భక్తులర్చింపగ (నే) చ. భుజియింప పెట్ట సతి బుధులు సామాజికులు భజియింప సోదరులు పవన సూనుడజ బిడౌజాది సురులాప్తులైనారు నీరజ నయన శ్రీ త్యాగరాజ నుత బాలుడగు (నే)