Posts

Showing posts from January, 2014

మూసిన ముత్యాలకేలే మొరగులు

దక్షిణామూర్తే విదళిత దాసార్తే

సుబ్బీ గొబ్బెమ్మా

సుబ్బీగొబ్బెమ్మా.. సుబ్బణ్ణీయవే..
చామంతిపువ్వంటీచెల్లెల్నీయవే తామరపూవంటీతమ్ముణ్ణీయవే బంతిపువ్వంటిబావనివ్వవే
తాటి పండంటి తాతనివ్వవే
మల్లెపూవంటిమామా నివ్వవే
అరటిపండంటి అత్తనివ్వవే మొగలిపూవంటీ.. మొగుణ్ణీయవే

అటవీ స్థలములు కడుగుదమా

అటవీ స్థలములు కరుగుదమా చెలి వట పత్రమ్ములు కోయుదమా!!2 సార్లు!! చింత పిక్కాలాడుదమా చిరు చిరు నవ్వులు నవ్వుదమా!!అటవీ!! చెమ్మా చెక్కాలాడుదమా చక్కిలిగింతలు పెట్టుదమా!!అటవీ!! కోతీ కొమ్మచ్చులాడుదమాకొమ్మల చాటున దాగుదమా!!అటవీ!! చల్లని గంధం తీయుదమా సఖియా మెడలో పూయుదమా!!అటవీ!! పూలదండలు గుచ్చుదమా దేవుని మెడలో వేయుదమా!!అటవీ!!

ఏల వచ్చెనమ్మ

Image
ఏల వచ్చెనమ్మ కృష్ణుడేల వచ్చెను ఆ మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చేసెను ఆ మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చేసెను ఉట్టి మీద పాలు పెరుగు ఎట్లు దించెనే? ఉట్టి మీద పాలు పెరుగు ఎట్లు దించెనే? కొట్టబోతే దొరకడమ్మ చిన్ని కృష్ణుడు!!ఏల!! కాళింది మడుగులోన దూకినాడమ్మా బాలుడు కాదమ్మ పెద్దవాడమ్మా!!ఏల!! చీరలన్ని మూట కట్టి చిన్ని కృష్ణుడు చీరలన్ని మూట కట్టి చిన్ని కృష్ణుడు ఆ పొన్న మాను పైన పెట్టి పంతమాడెనే!!ఏల!!

దుక్కు దుక్కు దున్నారంట

గొబ్బియళ్ళొగొబ్బియళ్ళొ గొబ్బియళ్ళొగొబ్బియళ్ళొ
దుక్కు దుక్కు దున్నారంట - ఏమి దుక్కు దున్నారంట
రాజా వారి తోటలో జామ దుక్కు దున్నారంట
అలనాటి అక్కల్లారా చంద్రగిరి భామల్లారా
భామలసిరి గొబ్బిళ్ళో గొబ్బియళ్ళొగొబ్బియళ్ళొ

విత్తు విత్తు వేశారంట - ఏమి విత్తు వేశారంట
రాజా వారి తోటలోన జామ విత్తు వేశారంట
అలనాటి అక్కల్లారా చంద్రగిరి భామల్లారా
గొబ్బిళ్ళో గొబ్బియళ్ళొగొబ్బియళ్ళొ
మొక్క మొక్క మొలిచిందంట - ఏమి మొక్క మొలిచిందంట
రాజా వారి తోటలోన జామ మొక్క మొలిచిందంట
అలనాటి అక్కల్లారా చంద్రగిరి భామల్లారా గొబ్బిళ్ళో గొబ్బియళ్ళొగొబ్బియళ్ళొ

పువ్వు పువ్వు పూసిందంట - ఏమి పువ్వు పూసిందంట
రాజా వారి తోటలోన జామ పువ్వు పూసిందంట   అలనాటి అక్కల్లారా చంద్రగిరి భామల్లారా
గొబ్బిళ్ళో గొబ్బియళ్ళొగొబ్బియళ్ళొ 
పిందె పిందె వేసిందంట - ఏమి పిందె వేసిందంట
రాజా వారి తోటలోన జామ పిందె వేసిందంట
అలనాటి అక్కల్లారా చంద్రగిరి భామల్లారా  గొబ్బిళ్ళో గొబ్బియళ్ళొగొబ్బియళ్ళొ

కాయ కాయ కాసిందంట - ఏమి కాయ కాసిందంట
రాజా వారి తోటలోన జామ కాయ కాసిందంట   అలనాటి అక్కల్లారా చంద్రగిరి భామల్లారా
గొబ్బిళ్ళో గొబ్బియళ్ళొగొబ్బియళ్ళొ

పండు పండు పండిందంట - ఏమి పండు …