Posts

Showing posts from November, 2013

తులసీ బిల్వ మల్లికాది

ప. తులసీ బిల్వ మల్లికాది
జలజ సుమముల పూజల కైకొనవే

అ. జలజాసన సనకాది కరార్చిత
జలదాభ సు-నాభ విభా-కర
హృజ్జలేశ హరిణాంక సు-గంధ (తులసీ)

చ. ఉరమున ముఖమున శిరమున భుజమున
కరమున నేత్రమున చరణ యుగంబున
కరుణతో నెనరుతో పరమానందముతో
నిరతమును శ్రీ త్యాగరాజు నిరుపాధికుడై అర్చించు (తులసీ)