Posts

Showing posts from February, 2019

ఛీ ఛీ నరులదేటి జీవనము కాచుక శ్రీహరి నీవే కరుణింతుగాక

Image
ఛీ ఛీ నరులదేటి జీవనము కాచుక శ్రీహరి నీవే కరుణింతుగాక అడవిలో మృగజాతియైన గావచ్చుగాక వడినితరుల గొలువఁగ వచ్చునా వుడివోని పక్షియైవుండనైనవచ్చుగాక విడువకెవ్వరినైనా వేడవచ్చునా!! పసురమై వెదలేని పాటుపడవచ్చుగాక కసివో నొరుల బొగడగావచ్చునా వుసురుమానై పుట్టి వుండనైనవచ్చుగాక విసువక వీరివారి వేసరించవచ్చునా!! యెమ్మెల బుణ్యాలుసేసి యిల యేలవచ్చుగాక కమ్మి హరిదాసుడు గావచ్చునా నెమ్మది శ్రీ వేంకటేశ నీ చిత్తమేకాక దొమ్ముల కర్మములివి తోయవచ్చునా!!