Posts

Showing posts from March, 2018

మంగళం జయ మంగళం.. మా నల్లనయ్యకు మంగళం

Image
మంగళంజయమంగళం..
మానల్లనయ్యకుమంగళం.. ||2||
మంగళంజయమంగళం ..
మా కృష్ణ స్వామికి మంగళం.. ||2|| ||మంగళం||
శిరమునందున మెరయుచుండెడి
నెమలి పింఛకు మంగళం.. ||2||
శ్యామలాంగుని కరములందలి
మధురమురళికి మంగళం..||2|| ||మంగళం||
వనజగమ్మును ధిక్కరించెడి
వదనశోభకు మంగళం...||2||
కరుణరసమును చిందుచుండెడి
కన్నుదోయికి మంగళం..||2|| || మంగళం||
బ్రహ్మచే పూజింపబడిన
చరణయుగళికి మంగళం..||2||
జగములన్నియు కన్నతండ్రగు
చక్కనయ్యకు మంగళం.. ||2|| || మంగళం||
గోపికా గణసేవితుడు
శ్రీ గోవిందునకు మంగళం.. ||2||
రాధికా పరివేష్టితుండౌ
రసేశ్వరునకు మంగళం... ||2|| ||మంగళం||