Posts

Showing posts from September, 2013

సూర్యగ్రహ స్తోత్ర కీర్తన

సూర్యమూర్తే నమోస్తుతే
సుందర ఛాయాధిపతే!! అ. కార్య కారణాత్మక జగత్ప్రకాశ
సింహ రాజ్యాధిపతే
ఆర్యవినుత తేజస్ఫూర్తే
ఆరోగ్యాది ఫలత్కీర్తే!! ౧. సారస మిత్ర మిత్రభానో
సహస్ర కిరణ కర్ణసూనో
కౄర పాపహర కృశానో
గురుగుహ మోదిత స్వభానో
సూరి జనేష్టిత సూదిన మణే
సోమాది గ్రహ శిఖామణే
ధీరార్చిత కర్మ సాక్షిణే
దివ్యతర సప్తాశ్వ రథినే
సౌవర్ణ స్వరూపాత్మనే
భారతీశ హరిహరాత్మనే
భుక్తి ముక్తి వితరణాత్మనే!!

శ్రీమూలాధారా చక్ర

ముద్దుగారే యశోదా

ముద్దుగారే యశోద ముంగిటి ముత్యము వీడు
తిద్దరాని మహిమల దేవకీ సుతుడు

అంత నింత గొల్లెతల అరచేతి మాణికము
పంత మాడే కంసుని పాలి వజ్రము
కాంతుల మూడు లోకాల గరుడ పచ్చ బూస
చెంతల మాలో నున్న చిన్ని కృష్ణుడు

రతికేళి రుక్మిణికి రంగు మోవి పగడము
మితి గోవర్ధనపు గోమేధికము
సతమై శంఖ చక్రాల సందుల వైడూర్యము
గతియై మమ్ము గాచేటి కమలాక్షుడు

కాళింగుని తలలపై గప్పిన పుష్యరాగము
యేలేటి శ్రీ వేంకటాద్రి యింద్రనీలము
పాల జలనిధి లోన బాయని దివ్య రత్నము
బాలునివలె దిరిగీ బద్మ నాభుడు

ఒకపరి కొకపరి

ప. ఒకపరికొకపరి వయ్యారమై ముఖమున కళలెల్ల మొలసినట్లుండె

1. జగదేక పతి మేన చల్లిన కర్పూర ధూళి
జిగిగొని నలువంక చిందగాను
మొగి చంద్రముఖి నురమున నిలిపెగాన
పొగరు వెన్నెల దిగిపోసినట్లుండె!!ఒకపరి!!

2. పొరి మెరుగు చెక్కుల పూసిన తట్టు పునుగు
కరిగి యిరుదెసల కారగాను
కరిగమన విభుడు గనుక మోహమదము
తొరిగి సామజ సిరి తొలకి నట్లుండె!!ఒకపరి!!

3. మెరయ శ్రీవేంకటేశు మేన సింగారముగాను
తరచైన సొమ్ములు ధరియించగా
మెరుగు బోడీ అలమేలు మంగయు తాను
మెరుపు మేఘము గూడి మెరసి నట్లుండె!!ఒకపరి!!

ఎంత మాత్రమున

ప. ఎంత మాత్రమున ఎవ్వరు దలచిన అంత మాత్రమే నీవు
అంతరాంతరములెంచి చూడ పిండంతేనిప్పటి అన్నట్లు!!

1. కొలుతురు మిము వైష్ణవులు కూరిమితో విష్ణుడని
పలుకుదురు మిము వేదాంతులు పరబ్రహ్మంబనుచు
తలతురు మిము శైవులు తగిన భక్తులును శివుడనుచు
అలరి పొగడుదురు కాపాలికులు ఆదిభైరవు౦డనుచు!!ఎంత!!

2. సరి నెన్నుదురు శాక్తేయులు శక్తి రూపిణి నీవనుచు
దరిశనములు మిము నానా విధములను తలపుల కొలదుల భజింతురు
సిరుల మిము నే అల్పబుద్ధి దలచిన వారికి అల్పంబవుదువు
గరిమిల మిము నే ఘనమని దలచిన ఘన బుద్ధులకు ఘనుడవు!!ఎంత!!

3. నీ వలనకొరతే లేదు మరి నీరు కొలది తామెరపు
ఆవల భాగీరథి దరి బావుల ఆజలమే ఊరినయట్లు
శ్రీవేంకటపతి నీవైతే మము చేకొని ఉన్నా దైవము
ఈవల నే నీ శరణననెదను ఇదియే పరతత్త్వము నాకు
ఇదియే పరతత్త్వము నాకు ఇదియే పరతత్త్వము నాకు!!ఎంత!!

ఇట్టి ముద్దులాడి

ప. ఇట్టి ముద్దులాడి బాలుడేడ వాడు
వాని పట్టి తెచ్చి పొట్టనిండ పాలు వోయరే!!

1. కామిడై పారితెంచి కాగెడి వెన్నెలలోన
చేమపూవు కడియాల చేయి వెట్టి
చీమ గుట్టెనని తన చెక్కిట కన్నీరు జార 
వేమరువాపోవు వాని వెడ్డు బెట్టరే!!ఇట్టి!!

2. ముచ్చువలె వచ్చి తన ముంగ మురువుల చేయి
తచ్చెడి పెరుగులోన దగలబెట్టి
నొచ్చెననీ చేయి తీసి నోరనెల్ల జొల్లుగార
వొచ్చెలి వాపోవువాని నూరడించరే!!ఇట్టి!!

3. ఎప్పుడు వచ్చెనో మాయిల్లు చొచ్చి
పెట్టెలోని చెప్పరాని ఉంగరాల చేయిపెట్టి
అప్పడైన వేంకటాద్రి అసవాలకుడు గాన
తప్పకుండా పెట్టె వాని తలకెత్తరే!!ఇట్టి!!

మేలుకో శృంగార రాయ

ప. మేలుకో శృంగారరాయ మేటి మదన గోపాల
మేలుకోవే మాపాలి మించిన నిధానమా
మేలుకో శృంగార రాయ మేటి మదన గోపాల
మేలుకోవే మాపాలి మించిన నిధానమా
మేలుకో శృంగార రాయ మేటి మదన గోపాల
ఆ ఆ ఆ ఆ ఆ ఆ

1. సందడించే గోపికల జవ్వన వనములోన
కందువ దిరిగే మదగజమవు - 2
ఇందుముఖి సత్యభామ హృదయ పద్మములోని
గంధము మరిగినట్టి గండు తుమ్మెద -2!!మేలుకో!!

2.  గతి గూడి రుక్మిణి కౌగిటి పంజరములో
రతి ముద్దు గులికేటి రాచిలుకా - 2
సతుల పదారువేల జంట కన్నుల గలువలు
కితమై పొదిమిన నా యిందు బింబమా -2!!మేలుకో!!

3. వరుస కొలనిలోని వారి చన్ను గొండలపై
నిరతి వాలిన నా నీలమేఘమా -2
సిరినురమున మోచి శ్రీ వేంకటాద్రి మీద
గరిమ వరాలిచ్చే కల్పతరువా -2!!మేలుకో!!


2. తిరువీధుల మెరసె

ప. తిరువీధుల మెరసే దేవదేవుడు
గరిమల మించిన సింగారముల తోడనూ!!

1. తిరుదండెలపైనేగి దేవుడిదే తొలినాడు
సిరులా రెండవనాడు శేషుని మీద
మిరిపెన మూడోనాడు ముత్యాలపందిరి క్రింద
పోరి నాలుగోనాడు పూవు కోవెల లోను!!

2. గక్కన ఐదావనాడు గరుడుని మీద
ఎక్కెను ఆరవనాడు ఏనుగు మీద
చొక్కమై ఏడవనాడు సూర్య ప్రభలోనను
యిక్కువ తేరును గుర్రమెనిమిదో నాడు!!

3. కనకపుటందలము కదసి తొమ్మిదోనాడు
పెనచి పదోనాడు పెండ్లిపీట
ఎనసి శ్రీవెంకటేశుడింతి అలమేల్మంగతో
వనితల నడుమను వాహనాల మీదను!!

శ్రీ నీలోత్పల నాయికే

పల్లవి
శ్రీ నీలోత్పల నాయికే జగదంబికే
శ్రీ నగర నాయికే మామవ వర దాయికే

అనుపల్లవి
దీన జనార్తి ప్రభంజన రీతి గౌరవే
దేశిక ప్రదర్శిత చిద్రూపిణి నత భైరవే
(మధ్యమ కాల సాహిత్యం)
ఆనందాత్మానుభవే అద్రి రాజ సముద్భవే
సూన శరారి వైభవే జ్ఞాన సుధార్ణవే శివే

చరణం
సంకల్ప వికల్పాత్మక చిత్త వృత్తి జాలే
సాధు జనారాధిత సద్గురు కటాక్ష మూలే
సంకట హర ధురీణ-తర గురు గుహానుకూలే
సమస్త విశ్వోత్పత్తి స్థితి లయాది కాలే

విటంక త్యాగరాజ మోహిత విచిత్ర లీలే
శంకరి కృపాలవాలే హాటక-మయ చేలే
పంకజ నయన విశాలే పద్మ రాగ మణి మాలే
శంకర సన్నుత బాలే శారదే గాన లోలే

వాతాపి గణపతిం భజే - హంసధ్వని రాగం

హ౦సధ్వని రాగ౦ – ఆది తాళ౦

ప!!వాతాపి గణపతి౦ భజేహ౦ వారణాస్య౦ వరప్రద౦!!

అ!!భూతాది స౦సేవిత చరణ౦! భూత భౌతిక ప్రప౦చ భరణ౦!!

మ!!సా!! వీతరాగిణ౦ వినుత యోగిన౦ విశ్వకారణ౦ విఘ్నవారణ౦!!వాతాపి!!

చ!!పురా కు౦భ స౦భవ మునివర ప్రపూజిత౦ – త్రికోణ మధ్యగత౦!
మురారి ప్రముఖాద్యుపాసిత౦, మూలాధార క్షేత్రస్థిత౦!
పరాది చత్వారి వాగాత్మక౦ ప్రణవ స్వరూప వక్రతు౦డ౦!
నిర౦తర౦ నిటల చ౦ద్ర ఖ౦డ౦ – నిజ వామకర విధ్రుతేక్షు ద౦డ౦!!

మ!!సా!!కరా౦బుజ పాశ బీజా పూర౦!
కలుష విదూర౦ భూతాకార౦!
హరాది గురుగుహ తోషిత బి౦బ౦!
హ౦సధ్వని భూషిత హేర౦బ౦!!వాతాపి!!