Posts

Showing posts from January, 2013

విష్ణుదేవు పాదములే

Image
                   విష్ణు దేవు పాదములే విద్యబుధ్ధీ మాకు వైష్ణవులమైతి మింక వదలవో కర్మమా || గోవిందునిపాదములే కోరి యిహపరములు శ్రీవిభునిపాదములే చేరువేదశాస్త్రములు దేవదేవుపాదములే దిక్కును దెసయు మాకు భావములో నిలిపితి పాయరో పాపములు || హరిపాదములే మాకు నన్నపానభోగములు పరమాత్ము పాదములే పాడీ పంటా మాకు మురహరు పాదములే ముందర వెనకా మాకు శరణంటి మెందైనా చనరో దుఃఖములు|| అనంతుని పాదములే ఆయుష్య భౌష్యములు దనుజారి పాదములే ధనధాన్య ధర్మములు యెనలేని శ్రీవేంకటేశు డితనిపాదాలే మనసున గొలిచితి మానరో భవములు||

నీ నామమే మాకు

Image
                    నీ నామమే మాకు నిధియు నిధానము నీ నామమే ఆత్మ నిధానాంజనము నమో నమో కేశవ నమో నారాయణ నమో నమో మాధవ నమో గోవింద నమో నమో విష్ణు నమో మధుసూదనా నమో త్రివిక్రమా నమో వామనా నమో నమో శ్రీధర నమో హృషీకేశ నమో పద్మనాభ నమో దామోదర నమో సంకర్షణ నమో వాసుదేవ నమో ప్రద్యుమ్నతే నమో అనిరుధ్ధా నమో పురుషోత్తమా నమో అధోక్షజా నమో నారసింహా నమోస్తు అచ్యుతా నమో జనర్ధనా నమోస్తు ఉపేంద్ర నమో శ్రీ వేంకటేశ నమో శ్రీ కృష్ణ

అన్ని మ౦త్రములు

Image
                                  13. అన్ని మంత్రములు ఇందె ఆవహించెను - వెన్నతో నాకు గలిగె వేంకటేశు మంత్రము నారదుడు జపియించె నారాయణ మంత్రము - చేరె ప్రహ్లాదుడు నారసింహ మంత్రము కోరి విభీషణుడు చేకొనె రామ మంత్రము - వేరెనాకు గలిగె వేంకటేశు మంత్రము రంగగు వాసుదేవ మంత్రము ధృవుండు జపించె - అంగవించె కృష్ణ మంత్రము అర్జునుడు ముంగిట విష్ణు మంత్రము మొగిశుకుడు పఠించె - వింగడమై నాకు నబ్బె వేంకటేశు మంత్రము ఇన్ని మంత్రముల కెల్ల ఇందిరనాథుడె గుఱి - పన్నిన దిదియే పరబ్రహ్మ మంత్రము నన్ను గావగలిగేబో నాకు గురుడియ్యగాను - వెన్నెల వంటిది శ్రీవేంకటేశు మంత్రము

మాధవా కేశవా

Image
12. మాధవ కేశవ మధుసూదన - విష్ణుశ్రీధరా పదనఖమ్ చింతయామి యూయమ్ .... వామన గోవింద వాసుదేవ ప్రద్యుమ్న - రామరామ కృష్ణ నారాయణాచ్యుత దామోదరానిరుధ్ధ దైవ పుండరీకాక్ష - నామత్రయాధీశ నమోనమో... పురుషోత్త మ పుండరీకాక్ష - దివ్యహరి సంకర్షణ అధోక్షజ నరసింహ హృషీకేశ నగధర త్రివిక్రమ - శరణాగత రక్ష జయజయ సేవే... మగిత జనార్దన మత్స్యకూర్మ వరాహా - సహజ భార్గవ బుధ్ధ జయతురగ కల్కి విహిత విజ్ఞాన శ్రీవేంకటేశ శుభకరం - అహమిహ తవపద దాస్యం అనిశం భజామి

దేవ దేవ౦ భజే

Image
10. దేవ దేవం భజే దివ్యప్రభావం రావణాసురవైరి రణపుంగవం రాజవరశేఖరం రవికులసుధాకరం ఆజానుబాహు నీలాభ్రకాయం రాజారి కోదండ రాజ దీక్షాగురుం రాజీవలోచనం రామచంద్రం నీలజీమూత సన్నిభశరీరం ఘనవిశాలవక్షం విమల జలజనాభం తాలాహినగహరం ధర్మసంస్థాపనం భూలలనాధిపం భోగిశయనం పంకజాసనవినుత పరమనారాయణం శంకరార్జిత జనక చాపదళనం లంకా విశోషణం లాలితవిభీషణం వెంకటేశం సాధు విబుధ వినుతం

క్షీరాబ్ది కన్యకకు

Image
9. క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికిని నీరజాలయమునకు నీరాజనం జలజాక్షి మోమునకు జక్కవ కుచంబులకు నెలకొన్న కప్పురపు నీరాజనం అలివేణి తురుమునకు హస్తకమలంబులకు నిలువుమాణిక్యముల నీరాజనం చరణ కిసలయములకు సకియరంభోరులకు నిరతమగు ముత్తేల నీరాజనం అరిది జఘనంబునకు అతివనిజనాభికిని నిరతి నానావర్ణ నీరాజనం పగటు శ్రీవేంకటేశు పట్టపురాణియై నెగడు సతికళలకును నీరాజనం జగతి నలమేల్మంగ చక్కదనములకెల్ల నిగుడు నిజ శోభనపు నీరాజనం