Navagraha Krithis నవగ్రహ కృతులు
అంగారకం ఆశ్రయామ్యహమ్ - రాగం సురటి - తాళం రూపకమ్ పల్లవి అంగారకం ఆశ్రయామ్యహం వినతాశ్రిత జన మందారం ( మధ్యమ కాల సాహిత్యమ్) మంగళ వారం భూమి కుమారం వారం వారమ్ అనుపల్లవి శృంగారక మేష వృశ్చిక రాశ్యధిపతిం రక్తాంగం రక్తాంబరాది ధరం శక్తి శూల ధరమ్ మంగళం కంబు గళం మంజుళ-తర పద యుగళం మంగళ దాయక మేష తురంగం మకరోత్తుంగమ్ చరణమ్ దానవ సుర సేవిత మంద స్మిత విలసిత వక్త్రం ధరణీ ప్రదం భ్రాతృ కారకం రక్త నేత్రమ్ దీన రక్షకం పూజిత వైద్య నాథ క్షేత్రం దివ్యౌఘాది గురు గుహ కటాక్షానుగ్రహ పాత్రమ్ ( మధ్యమ కాల సాహిత్యమ్) భాను చంద్ర గురు మిత్రం భాసమాన సుకళత్రం జానుస్థ హస్త చిత్రం చతుర్భుజం అతి విచిత్రమ్ ----------------------------------------------- పల్లవి: బుధమాశ్రయామి సతతం సురవినుతం చంద్రతారాసుతం!! బుధజనైర్వేదితం భూ-సురైర్మోదితం మధురకవితాప్రదం మహనీయసంపదం!!బుధమాశ్రయామి!! కుంకుమ సమద్యుతిం గురుగుహముదాకృతిం కుజవైరిణం మణిమకుటహారకేయూర కంకణాది ధరణం కమనీయతర మిథున కన్యాధిపం పుస్తకకరం నపుంసకం కింకర జన మహితం కిల్బిషాది రహితం శంకర భక్త హితం సదానంద సహితం!!బుధమాశ్రయామి!!...