ఎందఱో మహానుభావులు

           
                                             
            
          


. ఎందరో మహానుభావులందరికి వందనము

. చంద్ర వదనునియంద చందమును
హృదయారవిందమున జూచి
బ్రహ్మానందమనుభవించు వా(రెందరో)

1. సామ గాన లోల మనసిజ లావణ్య
ధన్య మూర్ధన్యు(లెందరో)

2. మానస వన చర వర సంచారము సలిపి
మూర్తి బాగుగ పొడగనే వా(రెందరో)

3. సరగున పాదములకు స్వాంతమను
సరోజమును సమర్పణము సేయు వా(రెందరో)

4. పతిత పావనుడనే పరాత్పరుని గురించి
పరమార్థమగు నిజ మార్గముతోను
పాడుచును సల్లాపముతో
స్వర లయాది రాగములు తెలియు వా(రెందరో)

5. హరి గుణ మణి-మయ సరములు గళమున
శోభిల్లు భక్త కోటులిలలో
తెలివితో చెలిమితో కరుణ కల్గి
జగమెల్లను సుధా దృష్టిచే బ్రోచు వా(రెందరో)

6. హొయలు మీర నడలు కల్గు సరసుని
సదా కనుల జూచుచును పులక శరీరులై
ఆనంద పయోధి నిమగ్నులై
ముదంబునను యశము కల వా(రెందరో)

7. పరమ భాగవత మౌని వర శశి
విభా-కర సనక సనందన
దిగీశ సుర కింపురుష కనక కశిపు
సుత నారద తుంబురు
పవన సూను బాల చంద్ర ధర శుక
సరోజ భవ భూ-సుర వరులు
పరమ పావనులు ఘనులు శాశ్వతులు
కమల భవ సుఖము సదానుభవులు గాక(యెందరో)

8. నీ మేను నామ వైభవంబులను
నీ పరాక్రమ ధైర్యముల
శాంత మానసము నీవులను
వచన సత్యమును రఘువర నీయెడ
సద్భక్తియు జనించకను దుర్మతములను
కల్ల జేసినట్టి నీ మది-
నెరింగి సంతసంబునను గుణ
భజనానంద కీర్తనము సేయు వా(రెందరో)

9. భాగవత రామాయణ గీతాది
శ్రుతి శాస్త్ర పురాణపు
మర్మములను శివాది షణ్మతముల
గూఢములను ముప్పది ముక్కోటి
సురాంతరంగముల భావంబుల-
నెరింగి భావ రాగ లయాది సౌఖ్యముచే
చిరాయువుల్ కల్గి నిరవధి సుఖాత్ములై
త్యాగరాజాప్తులైన వా(రెందరో)

10. ప్రేమ ముప్పిరికొను వేళ
నామము తలచే వారు
రామ భక్తుడైన త్యాగ-
రాజ నుతుని నిజ దాసులైన వా(రెందరో)

Comments

Popular posts from this blog

వీడివో అల విజయరాఘవుడు

వస్తా వట్టిదే పోతా వట్టిదే ఆశ ఎందుకంట

మంగళం జయ మంగళం.. మా నల్లనయ్యకు మంగళం