రారా మాఇంటి దాకా

ప. రారా మాయింటిదాక రఘు-
వీర సుకుమార మ్రొక్కెదరా

అ. రారా దశరథ కుమార నన్నేలు-
కోరా తాళ లేరా (రా)

చ1. కోరిన కోర్కె కొన-సాగకనే
నీరజ నయన నీ దారిని కని
వేసారితి కాని సాధు జనావన
సారి వెడలి సామి నేడైన (రా)

చ2. ప్రొద్దున లేచి పుణ్యము తోటి
బుద్ధులు జెప్పి బ్రోతువు కాని
ముద్దు కారు నీ మోమును జూచుచు
వద్ద నిలిచి వారము పూజించెద (రా)

చ3. దిక్కు నీవనుచు తెలిసి నన్ను బ్రోవ
గ్రక్కున రావు కరుణను నీచే
జిక్కియున్నదెల్ల మరతురాయిక
శ్రీ త్యాగరాజుని భాగ్యమా (రా)

Comments

Popular posts from this blog

వీడివో అల విజయరాఘవుడు

మంగళం జయ మంగళం.. మా నల్లనయ్యకు మంగళం

వస్తా వట్టిదే పోతా వట్టిదే ఆశ ఎందుకంట