పరమాత్ముడు వెలిగే ముచ్చట

ప. పరమాత్ముడు వెలిగే ముచ్చట
బాగ తెలుసుకోరే

అ. హరియట హరుడట సురులట నరులట
అఖిలాండ కోటులట అందరిలో (ప)

చ. గగనానిల తేజో-జల భూ-మయమగు
మృగ ఖగ నగ తరు కోటులలో
స-గుణములో వి-గుణములో సతతము
సాధు త్యాగరాజాది ఆశ్రితులలో (ప)

Comments

Popular posts from this blog

గరుడగమన తవ చరణకమలమిహ మనసి లసతు మమ నిత్యం౹

గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి