నగుమోము గలవాని

             


. నగు మోము గల వాని నా మనో-హరుని
జగమేలు శూరుని జానకీ వరుని

1. దేవాది దేవుని దివ్య సుందరుని
శ్రీ వాసు-దేవుని సీతా రాఘవుని ()

2. సుజ్ఞాన నిధిని సోమ సూర్య లోచనుని
అజ్ఞాన తమమును అణచు భాస్కరుని ()

3. నిర్మలాకారుని నిఖిలాఘ హరుని
ధర్మాది మోక్షంబు దయ చేయు ఘనుని ()

4. బోధతో పలుమారు పూజించి నే-
నారాధింతు శ్రీ త్యాగరాజ సన్నుతుని ()

Comments

Popular posts from this blog

గరుడగమన తవ చరణకమలమిహ మనసి లసతు మమ నిత్యం౹

గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి