వేణుగాన లోలుని గన

ప. వేణు గాన లోలుని కన వేయి కన్నులు కావలెనే

అ. (అలి) వేణులెల్ల దృష్టి చుట్టి వేయుచు మ్రొక్కుచు రాక (వేణు)

చ. వికసిత పంకజ వదనులు వివిధ గతులనాడగ-
నొకరికొకరు కరముననిడి ఓర కనుల జూడగ
శుక రవములు-గల తరుణులు సొగసుగాను పాడగ
సకల సురులు త్యాగరాజ సఖుని వేడగ వచ్చు (వేణు)

Comments

Popular posts from this blog

గరుడగమన తవ చరణకమలమిహ మనసి లసతు మమ నిత్యం౹

గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి