జగదానంద కారక

ప. జగదానంద కారక
జయ జానకీ ప్రాణ నాయక

అ. గగనాధిప సత్కులజ రాజ రాజేశ్వర
సు-గుణాకర సుర సేవ్య భవ్య దాయక
సదా సకల (జ)

చ1.అమర తారక నిచయ కుముద హిత
పరిపూర్ణానఘ సుర సుర భూజ
దధి పయోధి వాస హరణ
సుందర-తర వదన సుధా-మయ వచో-
బృంద గోవింద సానంద
మా-వరాజరాప్త శుభ కరానేక (జ)

చ2. నిగమ నీరజామృతజ
పోషకానిమిష వైరి వారిద సమీరణ
ఖగ తురంగ సత్కవి హృదాలయాగణిత
వానరాధిప నతాంఘ్రి యుగ (జ)

చ3. ఇంద్ర నీల మణి సన్నిభాపఘన
చంద్ర సూర్య నయనాప్రమేయ
వాగీంద్ర జనక సకలేశ శుభ్ర
నాగేంద్ర శయన శమన వైరి సన్నుత (జ)

చ4. పాద విజిత మౌని శాప సవ
పరిపాల వర మంత్ర గ్రహణ లోల
పరమ శాంత చిత్త జనకజాధిప
సరోజ భవ వరదాఖిల (జ)

చ5. సృష్టి స్థిత్యంత-కారకామిత
కామిత ఫలదాసమాన గాత్ర
శచీ పతి నుతాబ్ధి మద హరానురాగ
రాగ రాజిత కథా సార హిత (జ)

చ6. సజ్జన మానసాబ్ధి సుధా-కర
కుసుమ విమాన సురసా రిపు కరాబ్జ
లాలిత చరణావ-గుణాసుర గణ
మద హరణ సనాతనాజ నుత (జ)

చ7. ఓంకార పంజర కీర పుర
హర సరోజ భవ కేశవాది
రూప వాసవ రిపు జనకాంతక కలా-
ధర కలా ధరాప్త ఘృణా-కర
శరణాగత జన పాలన సు-మనో-
రమణ నిర్వికార నిగమ సారతర (జ)

చ8. కర ధృత శర జాలాసుర
మదాపహరణావనీ సుర సురావన
కవీన బిలజ మౌని కృత చరిత్ర
సన్నుత శ్రీ త్యాగరాజ నుత (జ)

చ9. పురాణ పురుష నృ-వరాత్మజాశ్రిత
పరాధీన ఖర విరాధ రావణ
వి-రావణానఘ పరాశర మనో-
హరావికృత త్యాగరాజ సన్నుత (జ)

చ10. అగణిత గుణ కనక చేల
సాల విదళనారుణాభ సమాన
చరణాపార మహిమాద్భుత సు-కవి జన
హృత్సదన సుర ముని గణ విహిత
కలశ నీర నిధిజా రమణ పాప గజ
నృ-సింహ వర త్యాగరాజాది నుత (జ)

Comments

Popular posts from this blog

వస్తా వట్టిదే పోతా వట్టిదే ఆశ ఎందుకంట

వీడివో అల విజయరాఘవుడు

పరమేశ్వరాజ్ఞ ఏమో తెలియదు అది ఎవరెరుగరు ఈశ్వరాజ్ఞ