ఏల నీ దయా రాదు

ప. ఏల నీ దయ రాదు పరాకు
జేసేవేల సమయము కాదు

అ. బాల కనక మయ చేల సుజన
పరిపాల శ్రీ రమా లోల విధృత శర
జాల శుభద కరుణాలవాల ఘన
నీల నవ్య వన మాలికాభరణ (ఏ)

చ1. రారా దేవాది దేవ రారా మహానుభావ
రారా రాజీవ నేత్ర రఘు వర పుత్ర
సారతర సుధా పూర హృదయ
పరివార జలధి గంభీర దనుజ
సంహార మదన సుకుమార బుధ జన
విహార సకల శ్రుతి సార నాదుపై (ఏ)

చ2. రాజాధి రాజ ముని పూజిత పాద రవి
రాజ లోచన శరణ్య అతి లావణ్య
రాజ ధర నుత విరాజ తురగ సుర
రాజ వందిత పదాజ జనక దిన
రాజ కోటి సమ తేజ దనుజ గజ
రాజ నిచయ మృగ రాజ జలజ ముఖ (ఏ)

చ3. యాగ రక్షణ పరమ భాగవతార్చిత
యోగీంద్ర సుహృద్భావితాద్యంత రహిత
నాగ శయన వర నాగ వరద
పున్నాగ సుమ ధర సదాఘ మోచన
సదా గతిజ ధృత పదాగమాంత చర
రాగ రహిత శ్రీ త్యాగరాజ నుత (ఏ)

Comments

Popular posts from this blog

గరుడగమన తవ చరణకమలమిహ మనసి లసతు మమ నిత్యం౹

గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి