గంధము పూయరుగా

ప. గంధము పుయ్యరుగా పన్నీరు గంధము పుయ్యరుగా

అ. అందమైన యదు నందనుపై
కుంద రదనలిరవొందగ పరిమళ (గ)

చ1. తిలకము దిద్దెరుగా కస్తూరి తిలకము దిద్దెరుగా
కలకలమని ముఖ కళ కని సొక్కుచు
పలుకులనమృతములొలికెడు స్వామికి (గ)

చ2. చేలము కట్టెరుగా బంగరు చేలము కట్టెరుగా
మాలిమితో గోపాల బాలులతో-
నాల మేపిన విశాల నయనునికి (గ)

చ3. హారతులెత్తెరుగా ముత్యాల హారతులెత్తెరుగా
నారీ మణులకు వారము యౌవన
వారకమొసగెడు వారిజాక్షునికి (గ)

చ4. పూజలు సేయరుగా మనసార పూజలు సేయరుగా
జాజులు మరి విరివాజులు దవనము
రాజిత త్యాగరాజ నుతునికి (గ)

Comments

Popular posts from this blog

వీడివో అల విజయరాఘవుడు

వస్తా వట్టిదే పోతా వట్టిదే ఆశ ఎందుకంట

మంగళం జయ మంగళం.. మా నల్లనయ్యకు మంగళం