తెర తీయగ రాదా

ప. తెర తీయగ రాదా లోని
తిరుపతి వేంకట రమణ మత్సరమను (తెర)

అ. పరమ పురుష ధర్మాది మోక్షముల
పార-దోలుచున్నది నా లోని (తెర)

చ1. మత్స్యముయాకలి కొని కాలముచే
మగ్నమైన రీతినున్నది
అచ్చమైన దీప సన్నిధిని మరు-
గడ్డబడి చెరచినట్టున్నది (తెర)

చ2. ఇరవొందగ భుజియించు సమయమున
ఈగ తగులు రీతినున్నది
హరి ధ్యానము సేయు వేళ చిత్తము
అంత్యజు వాడకు పోయినట్టున్నది (తెర)

చ3. వాగురమని తెలియక మృగ గణములు
వచ్చి తగులు రీతినున్నది
వేగమే నీ మతముననుసురించిన
త్యాగరాజ నుత మద మత్సరమను (తెర)

Comments

Popular posts from this blog

వస్తా వట్టిదే పోతా వట్టిదే ఆశ ఎందుకంట

వీడివో అల విజయరాఘవుడు

పరమేశ్వరాజ్ఞ ఏమో తెలియదు అది ఎవరెరుగరు ఈశ్వరాజ్ఞ