ఎంత మాత్రమున

                  
ప. ఎంత మాత్రమున ఎవ్వరు దలచిన అంత మాత్రమే నీవు
అంతరాంతరములెంచి చూడ పిండంతేనిప్పటి అన్నట్లు!!

1. కొలుతురు మిము వైష్ణవులు కూరిమితో విష్ణుడని
పలుకుదురు మిము వేదాంతులు పరబ్రహ్మంబనుచు
తలతురు మిము శైవులు తగిన భక్తులును శివుడనుచు
అలరి పొగడుదురు కాపాలికులు ఆదిభైరవు౦డనుచు!!ఎంత!!

2. సరి నెన్నుదురు శాక్తేయులు శక్తి రూపిణి నీవనుచు
దరిశనములు మిము నానా విధములను తలపుల కొలదుల భజింతురు
సిరుల మిము నే అల్పబుద్ధి దలచిన వారికి అల్పంబవుదువు
గరిమిల మిము నే ఘనమని దలచిన ఘన బుద్ధులకు ఘనుడవు!!ఎంత!!

3. నీ వలనకొరతే లేదు మరి నీరు కొలది తామెరపు
ఆవల భాగీరథి దరి బావుల ఆజలమే ఊరినయట్లు
శ్రీవేంకటపతి నీవైతే మము చేకొని ఉన్నా దైవము
ఈవల నే నీ శరణననెదను ఇదియే పరతత్త్వము నాకు
ఇదియే పరతత్త్వము నాకు ఇదియే పరతత్త్వము నాకు!!ఎంత!!

Comments

Popular posts from this blog

వస్తా వట్టిదే పోతా వట్టిదే ఆశ ఎందుకంట

వీడివో అల విజయరాఘవుడు

పరమేశ్వరాజ్ఞ ఏమో తెలియదు అది ఎవరెరుగరు ఈశ్వరాజ్ఞ