మేలుకో శృంగార రాయ

                       
ప. మేలుకో శృంగారరాయ మేటి మదన గోపాల
మేలుకోవే మాపాలి మించిన నిధానమా
మేలుకో శృంగార రాయ మేటి మదన గోపాల
మేలుకోవే మాపాలి మించిన నిధానమా
మేలుకో శృంగార రాయ మేటి మదన గోపాల
ఆ ఆ ఆ ఆ ఆ ఆ

1. సందడించే గోపికల జవ్వన వనములోన
కందువ దిరిగే మదగజమవు - 2
ఇందుముఖి సత్యభామ హృదయ పద్మములోని
గంధము మరిగినట్టి గండు తుమ్మెద -2!!మేలుకో!!

2.  గతి గూడి రుక్మిణి కౌగిటి పంజరములో
రతి ముద్దు గులికేటి రాచిలుకా - 2
సతుల పదారువేల జంట కన్నుల గలువలు
కితమై పొదిమిన నా యిందు బింబమా -2!!మేలుకో!!

3. వరుస కొలనిలోని వారి చన్ను గొండలపై
నిరతి వాలిన నా నీలమేఘమా -2
సిరినురమున మోచి శ్రీ వేంకటాద్రి మీద
గరిమ వరాలిచ్చే కల్పతరువా -2!!మేలుకో!!


Comments

Popular posts from this blog

గరుడగమన తవ చరణకమలమిహ మనసి లసతు మమ నిత్యం౹

గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి