ఒకపరి కొకపరి

                         
ప. ఒకపరికొకపరి వయ్యారమై ముఖమున కళలెల్ల మొలసినట్లుండె

1. జగదేక పతి మేన చల్లిన కర్పూర ధూళి
జిగిగొని నలువంక చిందగాను
మొగి చంద్రముఖి నురమున నిలిపెగాన
పొగరు వెన్నెల దిగిపోసినట్లుండె!!ఒకపరి!!

2. పొరి మెరుగు చెక్కుల పూసిన తట్టు పునుగు
కరిగి యిరుదెసల కారగాను
కరిగమన విభుడు గనుక మోహమదము
తొరిగి సామజ సిరి తొలకి నట్లుండె!!ఒకపరి!!

3. మెరయ శ్రీవేంకటేశు మేన సింగారముగాను
తరచైన సొమ్ములు ధరియించగా
మెరుగు బోడీ అలమేలు మంగయు తాను
మెరుపు మేఘము గూడి మెరసి నట్లుండె!!ఒకపరి!!

Comments

Popular posts from this blog

వస్తా వట్టిదే పోతా వట్టిదే ఆశ ఎందుకంట

వీడివో అల విజయరాఘవుడు

పరమేశ్వరాజ్ఞ ఏమో తెలియదు అది ఎవరెరుగరు ఈశ్వరాజ్ఞ