ఇతడొకడే సర్వేశ్వరుడు


ప|| ఇతడొకడే సర్వేశ్వరుడు | సిత కమలాక్షుడు శ్రీ వేంకటేశుడు ||

చ|| పరమ యోగులకు భావ నిధానము | అరయ నింద్రాదుల కైశ్వర్యము |
గరిమ గొల్లెతల కౌగిటి సౌఖ్యము | సిరులొసగేయీ శ్రీ వేంకటేశుడు ||

చ|| కలి్గికి యశోదకు కన్న మాణికము తలచిన కరికిని తగుదిక్కు |
అల ద్రౌపదికిని ఆపద్బంధుడు | చెలరేగిన యీ శ్రీ వేంకటేశుడు ||

చ|| తగిలిన మునులకు తపమున సత్ఫలము | ముగురు వేల్పులకు మూలమూ |
వొగినలమేల్మంగ కొనరిన పతియితడు | జిగిమించిన యీ శ్రీవేంకటేశుడు ||

Comments

Popular posts from this blog

గరుడగమన తవ చరణకమలమిహ మనసి లసతు మమ నిత్యం౹

గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి