దాచుకో నీపాదాలకు

   


దాచుకో నీపాదాలకు - తగ నే జేసినపూజ లివి
పూచి నీ కీరితిరూప - పుష్పములు ఇవి అయ్యా!!దాచుకో!!
 
వొక్క సంకీర్తనే చాలు - వొద్దికై మము రక్షించగ
తక్కినవి భండారాన - దాచి వుండనీ
వెక్కసమగు నీ నామము - వెల సులభము ఫల మధికము
దిక్కై నన్నేలితివి ఇకనవి తీరని నా ధనమయ్యా!!దాచుకో!!
 
నా నాలికపై నుండినానా సంకీర్తనలు
పూనినాచే నిన్ను -పొగడించితివి
వేనామాల వెన్నుడా -వినుతించ నెంతవాడ
కానిమ్మని నాకీపుణ్యము -గట్టితి వింతే అయ్యా
..
యీమాట గర్వము కాదు - నీ మహిమే కొనియాడితిగాని
చేముంచి నాస్వాతంత్ర్యము - చెప్పినవాడకాను
నేమాన పాడేవాడను - నేరము లెంచకుమీ
శ్రీమాధవా నే నీదాసుడశ్రీవేంకటేశుడవయ్యా!!దాచుకో!!

Comments

Popular posts from this blog

గరుడగమన తవ చరణకమలమిహ మనసి లసతు మమ నిత్యం౹

గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి