కొమ్మలాలా ఎంతవాడె గోవిందరాజు
కొమ్మలాలా ఎంతవాడె గోవిందరాజు
కుమ్మరించీ రాజసమే గోవిందరాజు
ఉలిపచ్చి నవ్వులతో ఒత్తిగిలి పవళించి
కొలువు సేయించుకొనీ గోవిందరాజు
జలజాక్షు లిద్దరును సరిపాదా లొత్తగాను
కొలదిమీర మెచ్చేనీ గోవిందరాజు
అదె నాభికమలాన అజుని పుట్టించి తాను
కొదలేక వున్నవాడు గోవిందరాజు
చెదరక తనవద్ద సేవ సేసే సతులకు
గుదిగుచ్చీ వలపులు గోవిందరాజు
ఒప్పుగా వామకరము ఒగిచాచి వలకేల
కొప్పు కడునెత్తినాడు గోవిందరాజు
ఇప్పుడు శ్రీవేంకటాద్రి నిరవై శంఖుచక్రాల
కుప్పె కటారము(లు) పట్టె గోవిందరాజు
Comments
Post a Comment