రామా కోదండ రామ

              


రామా కోదండ రామ! రామా కల్యాణ రామ
రామా పట్టాభి రామ! రామా రామయ్య(పావన) రామ

రామ సీతాపతి రామ! నీవేగతి
రామా నీకు మ్రొక్కితి! రామా నీచేజిక్కితి

రామా నీకెవరు జోడు! రామా క్రీగంట జూడు
రామా నేను నీవాడు! రామా నాతో మాటాడు

రామా నామమే మేలు! రామా చింతనే చాలు
రామా నీవు నన్నేలు! రామా రాయడే చాలు

రామా నీకొక్క మాట! రామా నాకొక్క మూట
రామా నీపాటే పాట! రామా నీబాటే బాట

రామా విరాజ రాజ! రామా ముఖజిత రాజ
రామా భక్త సమాజ! రక్షిత త్యాగరాజ

Comments

Popular posts from this blog

వస్తా వట్టిదే పోతా వట్టిదే ఆశ ఎందుకంట

పరమేశ్వరాజ్ఞ ఏమో తెలియదు అది ఎవరెరుగరు ఈశ్వరాజ్ఞ

వీడివో అల విజయరాఘవుడు