అదె చూడరయ్య పెద్ద హనుమంతుని
అదె చూడరయ్య పెద్ద హనుమంతుని
గుదిగొని దేవతలు కొనియాడేరయ్య
ఉదయాస్త శైలములు ఒక జంగగా చాచె
అదివో ధృవమండల మందే శిరసు
చదివె సూర్యుని వెంట సారె మొగము ద్రిప్పుచు
ఎదుట ఈతని మహిమ యేమని చెప్పేమయ్య ||
దండిగా బ్రహ్మాండము దాక తోకమీదికెత్తె
మెండగు దిక్కుల నిండా మేను వెంచెను
గుండుగూడ రాకాసుల కొట్టగ చేతుల చాచె
అండ ఈతని ప్రతాపం అరుదరుదయ్యా ||
దిక్కులు పిక్కటిల్లగ దేహరోమములు పెంచె
పక్కన లోకములకు ప్రాణమై నిల్చె
ఇక్కడ శ్రీవెంకటేశు హితవరి బంటాయె
మిక్కిలి ఈతని లావు మేలు మేలయ్య ||
Comments
Post a Comment