హెచ్చరిక గా రా రా హే రామచంద్రా

                    


. హెచ్చరికగా రారా హే రామ చంద్ర
హెచ్చరికగా రారా హే సుగుణ సాంద్ర

. పచ్చ విల్తునికన్న పాలిత సురేంద్ర (హెచ్చరిక)

1. కనక మయమౌ మకుట కాంతి మెరయగను
ఘనమైన కుండల యుగంబు కదలగను
ఘనమైన నూపుర యుగంబు ఘల్లనను
సనకాదులెల్ల కని సంతసిల్లగను (హెచ్చరిక)

2. ఆణి ముత్యాల సరులల్లలాడగను
వాణి పతీంద్రులిరు వరుస పొగడగను
మాణిక్య సోపానమందు మెల్లగను
వీణ పల్కుల వినుచు వేడ్క చెల్లగను (హెచ్చరిక)

3. నిను జూడ వచ్చు భగిని కరంబు చిలుక
మనసు రంజిల్ల నీ మహిమలను పలుక
మిను వాసులెల్ల విరులను చాల జిలుక
ఘన త్యాగరాజు కనుగొన ముద్దు గులుక (హెచ్చరిక)

Comments

Popular posts from this blog

గరుడగమన తవ చరణకమలమిహ మనసి లసతు మమ నిత్యం౹

గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి