జయమంగళము నీకు సర్వేశ్వరా

            


|| జయమంగళము నీకు సర్వేశ్వర |
జయమంగళము నీకు జలజవాసినికి ||

|| శరణాగతాపారిజాతమా |
 పొరినసురలపాలి భూతమా |
అరుదయిన సృష్టికి ఆదిమూలమా
వో హరీ నమో పరమపుటాలవాలమా ||జయ!!

|| సకలదేవతాచక్రవర్తి |
వెకలివై నిండిన విశ్వమూర్తి |
అకలంకమైన దయానిధి |
ఓ వికచముఖా నమో విధికి విధి ||జయ!!

|| కొలిచిన వారల కొంగుపైడి |
ములిగిన వారికి మొనవాడి |
కలిగిన శ్రీవేంకటరాయా |
మలసిదాసులమైన మాకు విధేయా ||


Comments

Popular posts from this blog

గరుడగమన తవ చరణకమలమిహ మనసి లసతు మమ నిత్యం౹

గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి