చేరి యశోదకు శిశువితడు

                       


చేరి యశోదకు శిశు వితడు
ధారుణి బ్రహ్మకు తండ్రియు నితడు

సొలసి జూచినను సూర్యచంద్రులను
లలివెద జల్లెడు లక్షణుడు
నిలిచిన నిలువున నిఖిల దేవతల
కలిగించు సురల గనివో యితడు ||చేరి యశోదకు||

మాటలాడినను మరియజాండములు
కోటులు ఒడమెటిగుణరాశి
నీటగు నూర్పుల నిఖిలవేదములు
చాటువనూరేటి సముద్ర మితడు ||చేరి యశోదకు||

ముంగిట పొలసిన మోహనమాత్మల
పొంగించే ఘన పురుషుడు
సంగతి మావంటి శరణాగతులకు
అంగము శ్రీవేంకటాధిపుడితడు ||చేరి యశోదకు||
Comments

Popular posts from this blog

గరుడగమన తవ చరణకమలమిహ మనసి లసతు మమ నిత్యం౹

గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి