ఏముకో చిగురు టధరమున

                        


 ఏముకో చిగురు టధరమున - ఎడనెడ కస్తూ రి నిండెను
భామిని విభునకు రాసిన - పత్రిక కాదు కదా
...
కలికి చకోరాక్షికి కడ - కన్నులు కెంపై తోచెనే
చెలువంబిప్పటిదేమో - చింతింపరే చలులు
నలువున ప్రాణేశ్వరుపై - నాటిన కొనచూపులు
నిలువుగపెరుకగనంటిన - నెత్తురు కాదుకదా
..
పడతికి చనుగవ మెరుగులు - పైపై పయ్యెద వెలుపల
కడుమించిన విధమేమో - కనుగొనరే చెలులు
ఉడుగని వేడుకతో ప్రియు - డొత్తి నఖ శశి రేఖలు
వెడలగ వేసవి కాలపు -వెన్నెల కాదు కదా
..
ముద్దియ చెక్కుల కెలకుల - ముత్యపు జల్లుల చేర్పులు
ఒద్దిక బాగు లివేమో - ఊహింపరే చెలులు
గద్దరి తిరువేంకటపతి - కౌగిటి అధరామృతముల
అద్దిన సురతపు చెమటల - అందము కాదుకదా


Comments

Popular posts from this blog

గరుడగమన తవ చరణకమలమిహ మనసి లసతు మమ నిత్యం౹

గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి