పూజలందరు జేసేదే పుష్పయాగము

                  


ప. పూజలందరు జేసేదే పుష్పయాగము
ఆజి నర్జునుడు చేసినది పుష్పయాగము

౧. మొదల శ్రీసతి చేతి మోహన కమలమే
పొదల నీకెపుడును పుష్పయాగము
గుదిగొన మిమ్మిద్దరి గూడించే మరువిరులు
పొదిగి పూజించిన పుష్పయాగము!!

౨. మాలాకారుడిచ్చిన మధురలో పూదండ
పోలింప నీకునదె పుష్పయాగము
కేలితో నారదుడొసగిన పారిజాతము
భూలోకమున నీకు పుష్పయాగము!!

౩. తొరలి అలమేల్మంగ తురుమున విరులే నీకు
పొరసి నీవురముపై పుష్పయాగము
సిరులతో మునులెల్ల శ్రీవేంకటాద్రీశ నీకు
పొరిపొరి జేసేరు పుష్పయాగము!!

Comments

Popular posts from this blog

వస్తా వట్టిదే పోతా వట్టిదే ఆశ ఎందుకంట

పరమేశ్వరాజ్ఞ ఏమో తెలియదు అది ఎవరెరుగరు ఈశ్వరాజ్ఞ

వీడివో అల విజయరాఘవుడు