విడువరాదెంతైన వెర్రివాడనైనా నీకు

            
విడువరాదెంతైన వెర్రివాడనైనా నీకు
కడవారు నవ్వకుండా కాచుకో నన్నును

జ్ఞానము నేనెరగ అజ్ఞానము నేనెరగ
మానను విషయములు మరిగి ఎంతైనా
నీనామము నొడిగి నీ దాసుడ ననుకొందు
దీనికే వహించుకోనీ దిద్దుకో నన్నును

అకర్మము నెరగను సుకర్మము నెరగను
ప్రకట సంసారముపై పాటు మానను
ఒక పని వాడనై వూని ముద్ర ధారినైతి
మొకమూడి ఇందుకే గోమున నేలునన్నును

వెనక గానను ముందు విచారించి కానను
నినుపై దేహధారినై నీకు మొక్కేను
ఘనుడ శ్రీ వేంకటేశ కన్నులెదుట పడితి
కని పో విడువరాదు కరుణించు నన్నును

Comments

Popular posts from this blog

వస్తా వట్టిదే పోతా వట్టిదే ఆశ ఎందుకంట

పరమేశ్వరాజ్ఞ ఏమో తెలియదు అది ఎవరెరుగరు ఈశ్వరాజ్ఞ

వీడివో అల విజయరాఘవుడు