పావన రామ నామ

   
ప: పావన రామ నామ సుధారస
పానము జేసేదెన్నటికో
సేవించియు శ్రీహరి పాదంబులు
చిత్తమునుంచే దెన్నటికో || పావన రామ ||

చ1: దాసులగని సంతోషమ్మున తవ
దాసోహమ్మను టెన్నటికో
భూ సుతకుసు నతి ప్రాణప్రదంబగు
పురుషోత్తము గనుటెన్నటికో || పావన రామ ||

చ2: చంచల గుణములు మాని సదా ని
శ్చలమతి నుండేదెన్నటికో
పంచ తత్వములు తారక నామము
పఠియించుట నా కెన్నటికో || పావన రామ ||

చ3: ఇనవంశాంబుధి చంద్రుడు కృపతో
ఇష్టము లొసగే దెన్నటికో
కనకచేలు కరుణాలవాలుని
కన్నుల జూచే దెన్నటికో || పావన రామ ||

చ4: వంచన లేకను భద్రాదీశుని
వర్ణన చేసేదెన్నటికో
అంచితముగ రామదాసుడనుకొని
ఆనందించే దెన్నటికో || పావన రామ ||

Comments

Popular posts from this blog

వస్తా వట్టిదే పోతా వట్టిదే ఆశ ఎందుకంట

వీడివో అల విజయరాఘవుడు

పరమేశ్వరాజ్ఞ ఏమో తెలియదు అది ఎవరెరుగరు ఈశ్వరాజ్ఞ