ఏదాయ నేమి హరి ఇచ్చిన జన్మమే చాలు

                       
ఏదాయ నేమి హరి ఇచ్చిన జన్మమే చాలు
ఆదినారాయణుడీ అఖిలరక్షకు(డు

శునకము బతుకును సుఖమయ్యే తోచుగాని
తనకది హీనమని తలచుకోదు
మనసొడబడితేను మంచిదేమి కానిదేమి
తనువులో అంతరాత్మ దైవమౌట తప్పదు

పురువు కుండే నెలవు భువనేశ్వరమై తోచు
పెరచోటి గుంతయైన ప్రియమై యుండు
యిరవై ఉండితే చాలు యెగువేమి దిగువేమి
వరుస లోకములు "సర్వం విష్ణు మయము"

అచ్చమైన జ్ఞానికి అంతా వైకుంఠమే
చెచ్చెర తన తిమ్మటే జీవన్ముక్తి
కచ్చుపెట్టి శ్రీవేంకటపతికిదాసుడైతే
హెచ్చుకుందేమి లేదు యేలినవాడితడే

Comments

Popular posts from this blog

వస్తా వట్టిదే పోతా వట్టిదే ఆశ ఎందుకంట

వీడివో అల విజయరాఘవుడు

పరమేశ్వరాజ్ఞ ఏమో తెలియదు అది ఎవరెరుగరు ఈశ్వరాజ్ఞ