మలసీ చూడరో మగసింహము

               
ప|| మలసీ జూడరో మగసింహము |
అలవి మీరిన మాయల సింహము ||

చ|| అదివో చూడరో ఆదిమ పురుషుని
పెద యౌబళముమీది పెనుసింహము
వెదికి బ్రహ్మాదులు వేదాంతతతులు
కదిసి కానగ లేని ఘనసింహము ||

చ|| మెచ్చి మెచ్చి చూడరో మితిమీరినయట్టి
చిచ్చరకంటితోడి జిగిసింహము
తచ్చిన వారిధిలోని తరుణిగౌగిటజేర్చి
నచ్చిన గోళ్ళ శ్రీ నరసింహము ||

చ|| బింకమున జూడరో పిరితీయక నేడు
అంకపుదనుజ సంహార సింహము
వేంకటనగముపై వేదాచలముపై
కింకలేక వడి బెరిగిన సింహము ||

Comments

Popular posts from this blog

గరుడగమన తవ చరణకమలమిహ మనసి లసతు మమ నిత్యం౹

గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి