తానె తానే యిందరి గురుడు

                     
ప|| తానె తానే యిందరి గురుడు
సానబట్టిన భోగి జ్ఞాన యోగి ||

చ|| అపరిమితములైన యజ్ఞాల వడిజేయ
బ్రపన్నులకు బుద్ధి వచరించి
తపముగా ఫలత్యాగము సేయించు
కపురుల గరిమల కర్మయోగి ||

చ|| అన్నిచేతలను బ్రహ్మార్పణవిధి జేయ
మన్నించు బుద్ధులను మరుగజెప్పి
ఉన్నతపదమున కొనరగ గరుణించు
పన్నగశయనుడే బ్రహ్మయోగి ||

చ|| తనరగ గపిలుడై దత్తాత్రేయుడై
ఘనమైన మహిమ శ్రీ వేంకటరాయడై
ఒనరగ సంసార యోగము గృపసేయు
అనిమిషగతులను అభ్యాసయోగి ||

Comments

Popular posts from this blog

వీడివో అల విజయరాఘవుడు

మంగళం జయ మంగళం.. మా నల్లనయ్యకు మంగళం

వస్తా వట్టిదే పోతా వట్టిదే ఆశ ఎందుకంట