ఆడరమ్మా పాడరమ్మా

ఆడరమ్మా పాడరమ్మా అందరు మీరు
వేడుక సంతసంబులు వెల్లివిరియాయను

కమలనాభుడు పుట్టె కంసుని మదమణచ
తిమిరి దేవకి దేవి దేహమందు
అమరులకు మునులకభయమిచ్చె నితడు
కొమరె గొల్లెతలపై కోరికలు నిలిపె

రేయిపగలుగ చేసి రేపల్లె పెరుగుజొచ్చె
ఆయెడా నావుల గాచె నాదిమూలము
యీ యెడ లోకాలు చూపె నిట్టే తనకడుపులో
మాయసేసి యిందరిలో మనుజుడైనిలిచె

బాలలీలలు నటించి బహుదైవికము మించె
పాలువెన్నలు దొంగిలె పరమమూర్తి
తాళిభూభారమణచె ధర్మము పరిపాలించె
మేలిమి శ్రీవేంకటాద్రి మీద నిట్టె నిలిచె

Comments

Popular posts from this blog

వీడివో అల విజయరాఘవుడు

వస్తా వట్టిదే పోతా వట్టిదే ఆశ ఎందుకంట

మంగళం జయ మంగళం.. మా నల్లనయ్యకు మంగళం