అతడెవ్వాడు చూపరే అమ్మలాల

                     
అతడెవ్వాడు చూపరే అమ్మలాల
ఏతుల నాడేటి క్రిశ్ణుడీతడే కాడుగదా ||

కందువ దేవకి బిడ్డగనె నట నడురేయి
అందియ్శోదకు గొడుకైనాడుట
నందడించి పూతకిచంటి పాలుదాగెనట
మందల ఆవులగాచి మలసెనట ||

మంచిబండి దన్నెనట ముద్దులు విరిచెనట
ఇంచుకంతవేల గొండయెత్తి నాడుట
మంచాలపై గొల్లెతలమానాలు చేకొనెనట
మించుల బిల్ల గోలివట్టి మెరసెనట ||

కాళింగుని మెట్టెనట కంసుబొరిగొనెనట
పాలించి సురల జేపట్టెనట
యీలీల వేంకటాద్రి నిరవైనదేవుడట
యేలెనట పదారు వేలింతుల నిందరిని ||

Comments

Popular posts from this blog

వీడివో అల విజయరాఘవుడు

మంగళం జయ మంగళం.. మా నల్లనయ్యకు మంగళం

వస్తా వట్టిదే పోతా వట్టిదే ఆశ ఎందుకంట