సకల జీవులకెల్ల సంజీవి యీమందు

                      
ప|| సకల జీవులకెల్ల సంజీవి యీమందు
వెకలులై యిందరు సేవించరో యీమందు ||

చ|| మూడు లోకము లొక్కట ముంచి పెరిగినది |
పోడిమి నల్లని కాంతి బొదలినది |
పీడుక కొమ్ములు నాల్గు పెనచి చేయువారినది |
వాడే శేషగిరిమీద నాటుకొన్న మందు ||

చ|| పడిగెలు వేయింటి పాము గాచుకున్నది |
కడు వేదశాస్త్రముల గబ్బు వేసీది |
యెడయక వొకకాంత యెక్కుక వుండినది |
కడలేని యంజనాద్రి గారుడపు మందు ||

చ|| బలు శంఖు జక్రముల బదనికెలున్నది |
తలచిన వారికెల్ల దత్త్వమైనది |
అలరిన బ్రహ్మరుద్రాదుల బుట్టించినది |
వెలుగు తోడుత శ్రీవేంకటాద్రి మందు ||

Comments

Popular posts from this blog

వస్తా వట్టిదే పోతా వట్టిదే ఆశ ఎందుకంట

వీడివో అల విజయరాఘవుడు

పరమేశ్వరాజ్ఞ ఏమో తెలియదు అది ఎవరెరుగరు ఈశ్వరాజ్ఞ