మైత్రీం భజత

                  

మైత్రీం భజత, అఖిల హృత్ జైత్రీం
ఆత్మవదేవ పరాన్నపి పశ్యత
యుద్ధం త్యజత, స్ఫర్ధాం త్యజత
త్యజత పరేషు అక్రమాక్రమణం!!

జననీ పృథివీ కామదుఘాస్తే
జనకో దేవః సకల దయాళుః
'
దామ్యత, దత్త, దయధ్వం' జనతాః
శ్రేయో భూయాత్ సకల జనానాం!!
 
(ఈసందేశం 23 అక్టోబర్, 1966 ఐక్యరాజ్య సమితిలో శ్రీమతి ఎం.ఎస్.సుబ్బులక్ష్మి గారిచే గానం చేయబడింది.). కంచి మహాస్వామి శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారు ప్రసాదించిన సంస్కృత గీతం. దీనిని ’అంతర్జాతీయ గీతం’గా పేర్కొనవచ్చు.
"అందరి హృదయాలనీ జయించే ’మైత్రి’ని మనం స్వీకరించాలి. ఇతరుల్ని ’మన’లాగే చూడాలి.
యుద్ధాన్నీ, స్పర్థనీ, అక్రమమైన ఆక్రమణలని విడనాడాలి. అన్ని కోరికలూ తీర్చే ఈ భూమి మన తల్లి. సర్వేశ్వరుడు, దయామయుడు భగవంతుడే మన తండ్రి.
దామ్యత - నిగ్రహణ కావాలి.
’దత్త’, అవసరంలో ఉన్నవారిని ఆదుకొనేలా సహాయాన్ని అందించాలి.
’దయధ్వం’ - సానుభూతితో కూడిన సహకారభావమే ’దయ’, దానిని చూపించాలి
ఈమూడు ’ద’కారాలు కావాలి.
సకల జనములకు శ్రేయస్సు కలగాలి".
మహర్షి శ్రీ మహాస్వామి వారి ఈ మహావాక్యాలు విశ్వమంతా మార్మ్రోగాలి. ఈ వాక్యాలే భారతదేశ హృదయనాదాలు. ఇదే భారతీయ దృక్పథం. ఈ దృక్పథంతోనే శాంతిని తన ప్రాణంగా చాటుకుంది మన భరతమాత. శాంతి సాధనకోసం - ఈ ఉపదేశమే హెచ్చరికగా కూడా మారుతుంది. ’దురాక్రమణ వద్దు’ అనే ఉపదేశంలోనే, అలా ఆక్రమించుకొనే వారిని శిక్షించే విజయనాదమూ నినదిస్తుంది. అదే గాండీవిని ప్రబోధించిన గీతా పాంచజన్య శంఖారావం.
-----------------------------------------------------------------------------
శ్రీ కంచి కామకోటి పీఠాధిపతులు జగద్గురు శ్రీ శంకరాచార్య శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర శ్రీచరణుల దివ్య సందేశము

మైత్రీం భజతాఖిల హృద్ జైత్రీం
ఆత్మవదేవ పరానపి పశ్యత
యుద్ధం త్యజత స్పర్ధాం త్యజత
త్యజత పరేష్వక్రమ మాక్రమణమ్!!
అందరి హృదయములను జయించు మైత్రిని పెంచుము. ఇతరుల నందరిని నీవలెనే చూచుకొనుము, యుద్దమును, స్పర్థను త్యజించుము. ఇతరులపై అక్రమ ఆక్రమణను వదిలిపెట్టుము.
జననీ పృథ్వీ కామదుఘాస్తే
జనకోదేవః సకల దయాళుః
దామ్యత దత్త దయధ్వం జనతాః
శ్రేయో భూయాత్ సకలజనానాం!!
పుడమి తల్లి అన్ని కోర్కెలను పిదుకగలదు. తండ్రి పరమేశ్వరుడు అందరియెడ దయాళువు. ఓ ప్రపంచ ప్రజలారా! దయా, దాననిగ్రహాదులను అలవరచు కొనుడు. మీ కేల్లరకు శ్రేయమగుత.
(ఈ సందేశము 23 అక్టోబర్, 1966 న ఐక్యరాజ్య సమితిలో శ్రీమతి యం.యస్.సుబ్బులక్ష్మి గారిచే గానము చేయబడినది.)
అని వందే శ్రీ గురుపరంపరాం పరాః అను గ్రంథమున వివరించబడినది.

Comments

Popular posts from this blog

వస్తా వట్టిదే పోతా వట్టిదే ఆశ ఎందుకంట

వీడివో అల విజయరాఘవుడు

పరమేశ్వరాజ్ఞ ఏమో తెలియదు అది ఎవరెరుగరు ఈశ్వరాజ్ఞ