మూసిన ముత్యాలకేలే మొరగులు

                    

    


మూసిన ముత్యాల కేలె మొఱగులు - ఆశల చిత్తాన కేలే అలవోకలు

కందులేని మోముకేలే కస్తూరి - చిందు నీకొప్పున కేలే సీమంతులు
మందయానమున కేలే మట్టెల మోత -గంధమేలే పైపై కమ్మని నీమేనికి

భారపు గుబ్బల కేలే పయ్యద నీ -బీరపు జూపుల కేలే పెడామోము
జీరల బుజాల కేలే చెమటల నీ -గోరంట గోళ్ళ కేలే కొనవాండ్లు

ముద్దుల మాటల కేలే ముదములు నీ -యద్దపు జెక్కుల కేలే అరవిరులు
వొద్దిక మాటల కేలే వూర్పులు నీకు -నద్దమేలే తిరువేంకటాద్రీశు గూడి

Comments

Popular posts from this blog

వస్తా వట్టిదే పోతా వట్టిదే ఆశ ఎందుకంట

వీడివో అల విజయరాఘవుడు

పరమేశ్వరాజ్ఞ ఏమో తెలియదు అది ఎవరెరుగరు ఈశ్వరాజ్ఞ