Posts
Showing posts from February, 2014
మూడేమాటలు మూడు మూళ్ళు తొమ్మిది
- Get link
- X
- Other Apps
ప || మూడేమాటలు మూడుమూళ్ళు తొమ్మిది వేడుకొని చదవరో వేదాంత రహస్యము || చ || జీవస్వరూపము చింతించి యంతటాను దేవుని వైభవము తెలిసి | భావించి ప్రకృతి సంపదయిది యెరుగుటే వేవేలు విధముల వేదాంత రహస్యము || చ || తనలోని జ్ఞానము తప్పకుండ తలబోసి | పనితోడ నందువల్ల భక్తినిలిపి | మనికిగా వైరాగ్యము మరవకుండుటే | వినవలసిన యట్టి వేదాంత రహస్యము || చ || వేడుకతో నాచార్య విశ్వాసము గలిగి | జాడల శరణాగతి సాధనమ్ముతో | కూడి శ్రీవేంకటేశ్వరు గొలిచి దాసుడౌటే | వీడని బ్రహ్మానంద వేదాంత రహస్యము ||
శ్రీ నామ రామాయణం
- Get link
- X
- Other Apps
బాల కాండము: శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ్ కాలాత్మక పరమేశ్వర రామ్ శేషతల్ప సుఖ నిద్రిత రామ్ బ్రహ్మాద్యమర ప్రార్థిత రామ్ చండకిరణకుల మండన రామ్ శ్రీ మద్దశరథ నందన రామ్ కౌసల్యా సుఖవర్ధన రామ్ విశ్వామిత్ర ప్రియ ధన రామ్ ఘోర తాటకా ఘాతక రామ్ మారీచాది నిపాతక రామ్ కౌశిక మఖ సంరక్షక రామ్ శ్రీమదహల్యోద్ధారక రామ్ రామ రామ జయ రాజా రామ్ రామ రామ జయ సీతారామ్ గౌతమముని సంపూజిత రామ్ సుర మునివర గణ సంస్తుత రామ్ నావిక ధావిత మృదు పద రామ్ మిథిలా పురజన మోహక రామ్ విదేహ మానస రంజక రామ్ త్ర్యమ్బక కార్ముక భంజక రామ్ సీతార్పిత వర మాలిక రామ్ కృత వైవాహిక కౌతుక రామ్ భార్గవ దర్ప వినాశక రామ్ శ్రీమదయోధ్యా పాలక రామ్ రామ రామ జయ రాజా రామ్ రామ రామ జయ సీతారామ్ అయోధ్య కాండము: అగణిత గుణగణ భాషిత రామ్ అవనీ తనయా కామిత రామ్ రాకా చంద్ర సమానన రామ్ పితృ వాక్యాశ్రిత కానన రామ్ రామ...