మూడేమాటలు మూడు మూళ్ళు తొమ్మిది

        


|| మూడేమాటలు మూడుమూళ్ళు తొమ్మిది  
వేడుకొని చదవరో వేదాంత రహస్యము ||   

|| జీవస్వరూపము చింతించి యంతటాను
దేవుని వైభవము తెలిసి |
భావించి ప్రకృతి సంపదయిది యెరుగుటే
వేవేలు విధముల వేదాంత రహస్యము ||

|| తనలోని జ్ఞానము తప్పకుండ తలబోసి |
పనితోడ నందువల్ల భక్తినిలిపి |
మనికిగా వైరాగ్యము మరవకుండుటే |
వినవలసిన యట్టి వేదాంత రహస్యము ||

|| వేడుకతో నాచార్య విశ్వాసము గలిగి |
జాడల శరణాగతి సాధనమ్ముతో |
కూడి శ్రీవేంకటేశ్వరు గొలిచి దాసుడౌటే |
వీడని బ్రహ్మానంద వేదాంత రహస్యము ||

Comments

Popular posts from this blog

వస్తా వట్టిదే పోతా వట్టిదే ఆశ ఎందుకంట

పరమేశ్వరాజ్ఞ ఏమో తెలియదు అది ఎవరెరుగరు ఈశ్వరాజ్ఞ

వీడివో అల విజయరాఘవుడు