సువ్వియనుచు పాడరమ్మా



సువ్వి యనుచు పాడరమ్మా సుందరాంగులెల్ల గూడి ,
నవ్వు మాట కాదె కొమ్మా నాతి సమర్త లాడే నమ్మా ,
యవ్వనంబు చాలదమ్మా, మి ఎరుగని బాలికమ్మా
బువ్వ తినుట నేరదమ్మా, పువ్వు బోణిని చూడరమ్మా ,
తెల్ల చీర కట్టెనమ్మా తోయజాక్షి ఎరుగదమ్మా
తల్లి జూచి చెప్పగనే తలను వంచి నవ్వెనమ్మా ,
పల్లవ పాణులు మీరు పచ్చియాకులు పరువరమ్మా
పాలు నెయ్యి తేగదమ్మా బాలికచే నద్దించ రమ్మా ,
విప్రవరుని పిలురమ్మా విడియము సమర్పింరమ్మా ,
విప్పి పంచాగము చూడగనే యుక్త మైన నక్షత్రమమ్మా
పుత్రులు ల్గెదరనుచూ భూసురులు పల్కెనమ్మా ,
భాసురాంగి త్తవార్కి శుభ లేఖ వ్రాయ రమ్మా
కాన్చనావ రత్న రోళ్ళపసుపు కొమ్ము రోకలిచే ,
పంచదార కొబ్బరినీ పడతులంతా దంచరమ్మా
కాంచనా పళ్ళెరములో కరము లొప్ప తోడరమ్మా,
మంచి సెనగలు ,చిమ్మిలినీ పంచి పెట్ట సాగి రమ్మా .

Comments

Popular posts from this blog

వీడివో అల విజయరాఘవుడు

మంగళం జయ మంగళం.. మా నల్లనయ్యకు మంగళం

వస్తా వట్టిదే పోతా వట్టిదే ఆశ ఎందుకంట