కళావతీ కమలాసన యువతీ
ప: కళావతీ కమలాసన యువతీ
కళ్యాణం కలయతు సరస్వతీ
అ.ప: బలాతిబలా మంత్రార్ణ రూపిణీ
భారతి మాతృకా శరీరిణీ
మలాలి విదారిణి వాగ్వాణీ
మధు-కర వేణీ వీణా పాణీ!!
౧. శరద్జ్యోత్స్నా శుభ్రాకారా
శశి వదనా కాశ్మీర విహారా
వర శారదా పరాంకుశ ధరా
వరదాభయ పాశ పుస్తక కరా
సురార్చిత పదాంబుజా శోభనా
శ్వేత పంకజాసనా సు-రదనా
సురారి గురు గుహ హృదయ రంజనీ
మురారి స్నుషా నిరంజనీ!!
Comments
Post a Comment